Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

తన రేసింగ్‌ గురించి అజిత్‌ ఓ డాక్యుమెంటరీ తీయిస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు చేయకుండా అజిత్‌ రేసింగ్‌ ఎందుకు చేస్తున్నారు, దానిపై డాక్‌ ఫిల్మ్‌ ఎందుకు తీస్తున్నాడు అనే డౌట్స్‌ ఉన్నవారందరికీ ఆ డాక్యమెంటరీనే క్లారిటీ ఇస్తున్నారు అనిపిస్తోంది. ‘గ్లాడియేటర్స్‌’ డాక్యుమెంటరీకి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

Gv Prakash

‘గ్లాడియేటర్స్‌’ సినిమా కాదు. అజిత్‌ కుమార్‌ మీద తెరకెక్కించిన డాక్యుమెంటరీ అది. ఒక రోజు రాత్రి ఒంటి గంట సమయంలో బోటిమ్‌ యాప్‌లో ఓ కాల్‌ వచ్చింది. ఎవరా అనుకుంటూ కాల్‌ లిఫ్ట్‌ చేస్తే.. అవతలవైపు అజిత్‌. ఆ టైమ్‌లో ఆయన కాల్‌ చేసి నా పనితనాన్ని మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ప్రశంసలు ఇచ్చిన ఆనందంతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అదంతా నాకు కొత్తగా అనిపించింది అని చెప్పారు జీవీ.

ఈ డాక్యుమెంటరీ అజిత్‌ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. అలాంటి డాక్‌ కోసం సంగీతం అందించడం ఓ గొప్ప బాధ్యతగా భావించి చేశాను. ఈ ప్రాజెక్ట్‌ నాకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయింది. తనను తాను ఎలా అంతర్జాతీయ వేదికపై చూడాలి అనుకుంటున్నారో ఈ డాక్యుమెంటరీలో చూపించారు అని చెప్పారు జీవీ. రాబోయే తరాలకు ఆయన డాక్యుమెంటరీ కీలకంగా నిలుస్తుంది. ఆయన సొంత డబ్బులతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించారు అని కూడా జీవీ చెప్పారు. మరి ఈ డాక్యుమెంటరీని ఎప్పుడు, ఎక్కడ తీసుకొస్తారో తెలియాల్సి ఉంది.

ఇక అజిత్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘డేర్‌ డెవిల్‌’ అంటూ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. త్వరలో పూర్తి స్థాయి చిత్రీకరణ ప్రారంభిస్తారట. పూర్తిస్థాయిలో కొత్త అజిత్‌ను ఈ సినిమాతో చూపించే ఉద్దేశంలో అధిక్‌ రవిచంద్రన్‌ ఉన్నారు. గతేడాది ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ వచ్చాక అజిత్‌ ఇంకే సినిమా చేయలేదు.

వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus