Hansika: సలార్ మూవీ సూపర్ అంటున్న హన్సిక.. ఆ విషయాలు చెప్పేసిందిగా!

  • November 8, 2023 / 09:43 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా తాజాగా హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ పై అంచనాలను మరింత పెంచేశారు. ప్రభాస్ బిల్లా సినిమాలో హన్సిక కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ను అభిమానించే వాళ్లలో హన్సిక కూడా ఒకరు కాగా ప్రస్తుతం రాబోతున్న సినిమాలలో సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు. సలార్ సినిమాకు సంబంధించి నాకు చాలా విషయాలు తెలుసని హన్సిక చెప్పుకొచ్చారు.

సలార్ సినిమాలో నటించిన శ్రేయారెడ్డి నాకు (Hansika) స్నేహితురాలు అని ఆమె చాలా విషయాలను రివీల్ చేసిందని హన్సిక కామెంట్లు చేశారు. ఆ విషయాలను రివీల్ చేయలేను కానీ సలార్1 మాత్రం సూపర్ గా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందని హన్సిక అభిప్రాయం వ్యక్తం చేశారు. సలార్ మూవీ పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

సలార్ పై అంచనాలను హన్సిక రెట్టింపు చేయగా సలార్ మూవీ ట్రైలర్ రిలీజైతే మాత్రం మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. అతి త్వరలో సలార్ మూవీ రిలీజ్ కానుంది. సలార్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నెల మొదటి వారంలో సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus