Hansika: కన్యాదానం చేయడానికి నువ్వేమి వస్తువు కాదు!

  • February 25, 2023 / 09:05 AM IST

హన్సిక తన వెడ్డింగ్ వీడియోని లవ్ షాది డ్రామా పేరిట ఓటీటీలో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో భాగంగా హన్సిక పెళ్లికి ముందు చేసినటువంటి పూజా కార్యక్రమాలు అలాగే తన పెళ్లి డ్రెస్ గురించి చూపించారు. ఇక కన్యదానం విషయంలో తన తల్లి తీసుకున్నటువంటి నిర్ణయం గురించి కూడా ఈ ఎపిసోడ్ లో హన్సిక తెలియజేశారు. సాధారణంగా పెళ్లిలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కన్యాదానం చేసే సంఘటన మనకు తెలిసిందే.

అయితే హన్సిక కన్యదానం చేయనని తన తల్లి చెప్పారట.ఇలా కన్యదానం గురించి హన్సిక తల్లి మాట్లాడుతూ నాకు కుటుంబంలో అందరికన్నా నువ్వే ఎక్కువ. ప్రతి అమ్మాయికి ఆత్మగౌరవం ఎంతో ముఖ్యం నీవల్లే నాకు అది పెరిగింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందని తెలిపారు. అందుకే నీ పెళ్లి విషయంలో నేను కన్యాదానం చేయకూడదని నిర్ణయించుకున్నాను. దానం చేయడానికి నువ్వు ఒక వస్తువు కాదు కన్య దానానికి బదులు గోదానం చేస్తాను.

పెళ్లి అయినా సరే నువ్వు ఈ ఇంటి కుమార్తెవే అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇలా హన్సిక తల్లి ఎమోషనల్ కావడంతో హన్సిక సైతం ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్యాదాన విషయంలో తన తల్లి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, హన్సిక వెల్లడించారు. ఇక ఈమె తన బిజినెస్ పార్ట్నర్ సోహెల్ కతురియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈయనకు ఇదే రెండవ పెళ్లి కావడం గమనార్హం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus