Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

‘దేశముదురు’ భామ హన్సిక మోత్వానీ(Hansika Motwani) విడాకులు తీసుకోబోతోందా.? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. భర్త సోహైల్ కతూరియా నుండి హన్సిక విడాకులు తీసుకున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది.

Hansika Motwani

కొన్నాళ్ళుగా వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయనే టాక్ నడిచింది. అయితే సెలబ్రిటీల పై ఇలాంటి గాసిప్స్ కామన్ అని అంతా అనుకుని.. లైట్ తీసుకున్నారు.

కానీ కట్ చేస్తే ముంబైలోని బాంద్రా కోర్టు…  వీరికి విడాకులు మంజూరు చేసినట్లు స్పష్టమవుతుంది. కొన్ని నెలల నుండి హన్సిక నిజంగానే తన భర్తకు దూరంగా, ముంబైలో ఉన్న తన తల్లి నివాసంలో ఉంటుందట.కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో దిగిన పెళ్లి ఫోటోలను కూడా హన్సిక డిలీట్ చేయడం జరిగింది.అప్పటి నుండే విడాకుల రూమర్స్ మొదలయ్యాయి.ఎట్టకేలకు అవి నిజమయ్యాయి అని కూడా చెప్పుకోవాలి.

2022 డిసెంబర్ 4న హన్సిక,సోహైల్ కతూరియాల వివాహం జైపూర్‌లో ఘనంగా జరిగింది. అయితే సరిగ్గా 4 ఏళ్ళు కూడా తిరక్కుండానే వీళ్ళు విడాకులు తీసుకోవడం అందరికీ షాకిచ్చే అంశం. వాస్తవానికి సోహైల్ కతూరియాకు హన్సిక రెండో భార్య. అంతకు ముందే అతనికి వేరే అమ్మాయితో వివాహం జరిగింది.విచిత్రం ఏంటంటే.. సొహైల్ కతూరియా మొదటి భార్య కూడా హన్సికకు బెస్ట్ ఫ్రెండ్. హన్సిక కారణంగానే సొహైల్ అతని మొదటి భార్యకి విడాకులు ఇచ్చినట్టు కూడా అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.

హన్సిక వాటిని ఖండించినప్పటికీ.. అవి ఆగలేదు. ఫైనల్ గా హన్సిక కూడా సొహైల్ కి విడాకులు ఇచ్చేసి సెపరేట్ అయ్యింది. మరి సినిమాల పరంగా ఏమైనా సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేస్తుందేమో చూడాలి.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus