Hansika: భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్న హన్సిక..పెళ్లి కార్యక్రమాలు షురూ..!

  • November 23, 2022 / 06:31 PM IST

నార్త్ కు చెందిన అమ్మాయి అయినప్పటికీ సౌత్ లోనే స్టార్ గా ఎదిగింది హన్సిక. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘దేశముదురు’ తో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ సినిమా అందించిన హిట్ వల్ల పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది హన్సిక.’మస్కా’ ‘బిల్లా’ వంటి పెద్ద పెద్ద సినిమాల్లో ఈమె నటించింది. 2011లో ‘మాప్పిళ్త్లె’ అనే మూవీతో ఈమె కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఈమె వ్యక్తిగత వ్యవహారాలు కూడా అందరికీ తెలిసినవే..! శింబుతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది ఈ బ్యూటీ. కానీ కొన్ని కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పేసింది. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్ళికి రెడీ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. తన చిన్నప్పటి స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ అయిన సోహైల్ తో పెళ్లికి రెడీ అయ్యింది హన్సిక. ఇదివరకే అతనికి పెళ్ళైనప్పటికీ.. కొన్ని కారణాల వల్ల తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు.

ఇక హన్సిక – సోహైల్ ల పెళ్లి డిసెంబర్ 4న రాజస్థాన్ లోని రాజకోటలో ఘనంగా జరగబోతుంది. ఆల్రెడీ పెళ్లి పనులు మొదలయ్యాయి. ముంబైలో మంగళవారం నాడు హన్సిక ఇంట ‘మాతా కీ చౌకి’ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందులో కాబోయే వధూవరులు ఇద్దరూ పాల్గొన్నారు.వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఈ పూజ కోసం రెడ్ డ్రెస్ లో కనిపించి హైలెట్ గా నిలిచారు..! అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus