Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

అబ్బాస్‌.. ఇప్పటితరానికి తెలియని లవర్‌ బాయ్‌. 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘ప్రేమదేశం’ సినిమా గురించి, ఆ సినిమా చూపించిన ఇంపాక్ట్‌ గురించి అప్పటి కుర్రాళ్లకు బాగా తెలుసు. స్టార్‌ హీరో కాకకపోయినా ఆయన హెయిర్‌ స్టైల్‌, డ్రెస్సింగ్‌ సెన్స్‌ను ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఇమిటేట్‌ చేశారు. ఆ సినిమాలో అతను చూపించి ఇంపాక్ట్‌ ఎంత అనేది చెప్పాలంటే ఆయన 50కిపైగా సినిమాలు చేసినా ‘ప్రేమదేశం’ అబ్బాస్‌ అనే పిలుస్తున్నారు. అలాంటి అబ్బాస్‌ 12 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు.

Abbas

2014లో ‘సవారీ 2’, ‘అలా జరిగింది ఒక రోజు’, ‘రామానుజన్‌’ అనే సినిమాలు చేసిన తర్వాత మరో సినిమా చేయలేదు. ఇప్పుడు అంటే 2026లో ‘హ్యాపీ రాజ్‌’ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రతో ఇన్నేళ్లకు కోలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆ ఈవెంట్‌తో తన కథ గురించి, దర్శకత్వం అవకాశం గురించి, ఆ సినిమాలో నటించేందుకు అబ్బాస్‌ అంగీకరించడానికి కారణం గురించి వివరంగా చెప్పుకొచ్చారు. ‘హ్యాపీ రాజ్‌’ సినిమా కథ పూర్తయ్యాక హీరో నవీన్‌ పొలిశెట్టికి మెయిల్‌ చేశారట మరియా రాజ్‌. స్క్రిప్టు చదివిన ఆయన.. కాల్‌ చేసి అరగంట మాట్లాడారట. ఆ మాటలతో తనపై తనకు నమ్మకం పెరిగిందని చెప్పారు. అయితా సినిమా ఆలోచన నచ్చినా అప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్‌ కారణంగా చేయలేకపోయారట.

ఆ తర్వాత జీవీ ప్రకాశ్‌కు సినిమా కథ చెప్పడం, ఆయన అంగీకరించడం జరిగిపోయాయని ప్రదీప్‌ రంగనాథన్‌ తెలిపారు. ఇక తాను ‘లవ్‌టుడే’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశానని.. ‘హ్యాపీరాజ్‌’ కూడా ఆ సినిమా లాగే ఆద్యంతం అలరిస్తుందని పేర్కొన్నారు. ఇక అబ్బాస్‌ సంగతి చెబుతూ.. మంచి కథ ఉంటే రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆయన చాలా కాలంగా వేచి చూశారు. ఈ క్రమంలో ఎన్నో స్టోరీలు విన్నాక తమ సినిమా నచ్చిందని అందుకే ‘రీ ఇంట్రీ ఇచ్చేందుకు పర్‌ఫెక్ట్‌ స్టోరీ ఇది’ అని నటించారని చెప్పారు.

మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags