Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 27, 2026 / 12:06 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • జీవీ ప్రకాష్ (Hero)
  • శ్రీ గౌరీ ప్రియా (Heroine)
  • అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం,మహేశ్ దేవి తదితరులు (Cast)
  • మరియా రాజ్ (Director)
  • జైవర్ద (Producer)
  • జస్టిన్ ప్రభాకరన్ (Music)
  • మధన్ క్రిస్టోఫర్ (Cinematography)
  • సెల్వ ఆర్.కె (Editor)
  • Release Date : మార్చి 27 2026
  • బియోండ్ పిక్చర్స్ (Banner)

ఓ పక్క సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోపక్క హీరోగా కూడా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash). నటుడిగా చెప్పుకోదగిన సక్సెస్..లు లేకపోయినా అవకాశం దొరికినప్పుడల్లా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సూపర్ సక్సెస్ అందుకోవాలని ‘హ్యాపీ రాజా’ (Happy Raj) గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జీవి ప్రకాష్. ప్రదీప్ రంగనాథన్ వద్ద ‘కోమాలి’ ‘లవ్ టుడే’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మరియా రాజ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మరి అతనైనా జీవి ప్రకాష్ కి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడేమో తెలుసుకుందాం రండి:

Happy Raj Movie Review

Happy Raj Movie Review And Rating

కథ: హ్యాపీ రాజ్ (జీవి ప్రకాష్ కుమార్) అందగాడు అయినప్పటికీ అతన్ని ఏ అమ్మాయి ప్రేమించదు. అందుకు కారణం అతని తండ్రి ఆనంద్ రాజ్(జార్జ్ మరియన్). ఒక్కగానొక్క కొడుకు కావడంతో హ్యాపీని అతి జాగ్రత్తగా పెంచుతాడు ఆనంద్ రాజ్. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కొడుకు ఎక్కడ చెడిపోతాడో అని భావించి కనీసం అతనికి పాకెట్ మనీ కూడా సరిగ్గా ఇవ్వడు. దీంతో తండ్రిగా దూరంగా వెళ్ళిపోయి ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు హ్యాపీ. ఈ క్రమంలో అతనికి బెంగళూరులో జాబ్ వస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న ప్రాజెక్ట్ లీడ్ కావ్యతో(శ్రీ గౌరీ ప్రియా) పరిచయం కూడా ఏర్పడుతుంది. హ్యాపీ టాలెంట్ చూసి కావ్య ఇంప్రెస్ అయ్యి ప్రేమలో పడుతుంది. వెంటనే అతన్ని తన ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. కావ్య తండ్రి రాజీవ్(అబ్బాస్) కూడా హ్యాపీని అల్లుడిగా చేసుకునేందుకు ముందుకొస్తాడు. కానీ హ్యాపీ తండ్రి వల్ల రాజీవ్ కి ఓ చేదు అనుభవం ఎదురవుతుంది? దాంతో కావ్య, హ్యాపీ..ల పెళ్ళికి ఆటంకాలు ఎదురవుతాయి. అవేంటి? అనేది మిగిలిన సినిమా.

Happy Raj Movie Review And Rating

నటీనటుల పనితీరు: జీవీ ప్రకాష్ కుమార్ స్టైలిష్ గా కనిపించాడు. కానీ అతని నటన పెద్దగా ఇంప్రెస్ చేయదు. కామెడీ సీన్స్ లో ఎమోషనల్ సీన్స్ లో కూడా అతను తేలిపోయాడు. హీరోయిన్, తెలుగమ్మాయి అయినటువంటి శ్రీ గౌరీ ప్రియా మాత్రం లుక్స్ తోనే కాదు నటనతో కూడా ఇంప్రెస్ చేసి ఫుల్ మార్క్స్ కొట్టేస్తుంది. సీనియర్ హీరో అబ్బాస్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ స్టైలిష్ గానే ఉన్నాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో బాగానే సెట్ అయ్యాడు… బాగానే నటించాడు కూడా..! కాకపోతే అతను కొంచెం స్లిమ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక హీరో తండ్రిగా చేసిన జార్జ్ మరియన్ అయితే తన మార్క్ నటనతో నవ్వించడమే కాకుండా కన్నీళ్లు కూడా పెట్టించాడు అని చెప్పాలి. సినిమాలో హీరో కంటే కూడా ఇతనిదే మెయిన్ రోల్ అని చెప్పాలి. మిగిలిన నటీనటులు ఓకే.

Happy Raj Movie Review And Rating

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు మరియా రాజ్ తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉంది. కానీ దానిని ఆసక్తిగా మలచడంలో విఫలమయ్యాడు. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ని తీసుకుంటే ఇంటర్వెల్ వరకు కథే మొదలవ్వదు. ఇక సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ వరకు కూడా కథ ముందుకు కదలదు. ఈ సినిమాలో హీరో పేరు హ్యాపీ రాజ్. కానీ సెకండాఫ్ మొత్తం అతని తండ్రితో హీరోయిన్ తండ్రికి క్షమాపణలు చెప్పించాలి. ఇదే కాన్ఫ్లిక్ట్ పాయింట్. సెకండాఫ్ మొత్తం దానికోసమే ప్రయత్నిస్తాడు హీరో. ఈ క్రమంలో వచ్చే కామెడీ ట్రాకులు అన్నీ విసిగిస్తాయి.

దీంతో ఈ సినిమాకి ‘హ్యాపీ రాజ్’ (Happy Raj) అనే టైటిల్ కంటే ‘సారీ రాజ్’ అనే టైటిల్ పెడితే బాగుండేది అనే ఆలోచనకి ప్రేక్షకుడు వచ్చేస్తాడు. అయితే ప్రీ క్లైమాక్స్ లో హీరో తండ్రికి పెట్టిన బ్యాక్ స్టోరీ ఎమోషనల్ గా కదిలిస్తుంది. అలాగే దాన్ని హీరోయిన్ తండ్రికి లింక్ చేస్తూ ఇచ్చిన ట్విస్ట్ కూడా సర్ప్రైజ్ చేస్తుంది. ఆ ట్విస్ట్ చూస్తే మొన్నామధ్య వచ్చిన ‘ఆయ్’ సినిమాలోని వినోద్ కుమార్- మైమ్ గోపి..ల ట్రాక్ గుర్తొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. లాజిక్ పట్టించుకోకుండా చూస్తే అది కొంతమందికి నచ్చే అవకాశం ఉంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోవడం వల్ల అది సేవయర్ పాయింట్ అని చెప్పడానికి లేదు. టెక్నికల్ గా సినిమా రిచ్ గానే ఉంది.ప్రొడక్షన్ వాల్యూస్,పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఆకట్టుకుంటాయి.

Happy Raj Movie Review And Rating

విశ్లేషణ: మంచి కోర్ పాయింట్ ఉన్నప్పటికీ ఆసక్తికర స్క్రీన్ ప్లే లేకపోవడం, లాజిక్స్ మిస్ అవ్వడం వల్ల ప్రేక్షకులను సంతృప్తిపరచడంలో విఫలమయ్యింది ‘హ్యాపీ రాజ్’.

Happy Raj Movie Review And Rating

ఫోకస్ పాయింట్: ఇంతటి సాగదీత కష్టం రాజ్

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gv prakash
  • #Happy Raj Movie
  • #Maria Raja Elanchezian
  • #Sri Gouri Priya

Reviews

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

3 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version