ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఎన్నో అవార్డులో వచ్చాయి. తాజాగా ఆస్కార్ వంటి గొప్ప అవార్డును సైతం అందుకుంది. చంద్ర బోస్ రాసిన ఈ అద్భుతమైన పాటను కాలభైరవ రాహుల్ ఎంతో అద్భుతంగా పాడారు. ఇక ఈ పాటకు అనుగుణంగా కీరవాణి సంగీతం అందించారు.
ఇలా ఈ పాటకు రామ్ చరణ్ ఎన్టీఆర్ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోని ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేశారు. అయితే ఈ సినిమా విడుదలయి దాదాపు సంవత్సరమవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఉన్నటువంటి క్రేజ్ తగ్గలేదని తెలుస్తుంది. ఇంకా ఈ పాటకు అక్కడక్కడ డాన్సులు చేస్తూ ఈ పాట పై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇండియన్ మాజీ క్రికెటర్స్ హర్బజన్ సింగ్ సురేష్ రైనా మరోసారి నాటు నాటు పాటకు కాలు కలుపుతూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. ఇండియాకు వరల్డ్ కప్ అందించిన జట్టు సభ్యులు అయినటువంటి వీరిద్దరూ తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ మైదానంలో సరదాగా హర్భజన్ సురేష్ రైనా ఇద్దరు కూడా నాటు నాటు పాటకు పెర్ఫార్మెన్స్ చేశారు.
ఇలా వీరిద్దరూ డాన్స్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో క్రికెట్ లవర్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి నాటు నాటు పర్ఫామెన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా విడుదలై సంవత్సరమైనా ఆస్కార్ వంటి గొప్ప అవార్డును అందుకున్న ఈ పాటకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని తాజాగా ఈ వీడియో మరోసారి నిరూపిస్తోంది. నాటు నాటుపాటకు మన క్రికెటర్స్ చేసినటువంటి డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్ వేసేయండి.