హరితేజకు మంచి బ్రేక్ ఇచ్చిన “అ..ఆ”

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన చిత్రాలను చూసి వచ్చిన తర్వాత అందులోని హీరో, హీరోయిన్లే కాకుండా కొన్నిపాత్రలు గుర్తుండి పోతాయి. అలా చిన్నపాత్రలకు సైతం పంచ్ డైలాగ్లను రాయడం త్రివిక్రమ్ కే సాధ్యం. లేటెస్ట్ గా అయన నుంచి వచ్చిన కుటుంబ కథా చిత్రం “అ..ఆ” కూడా ఈ విషయాన్ని మరోమారు నిరూపించింది. ఈ సినిమాలో మంగమ్మ పాత్ర ద్వారా హాస్యాన్ని పండించారు. సమంతకు అసిస్టెంటుగా నటించిన హరితేజ అందరికీ గుర్తుండి పోతుంది.

ఈటీవీలో ముత్యమంత పసుపు, మనసు మమత వంటి సీరియల్లో నటించిన హరితేజ విలేజ్‌లో వినాయకుడు, దమ్ము, అత్తారింటికి దారేది సినిమాల్లో చిన్నపాత్రల్లో కనిపించింది. “అ.. ఆ” లో మాత్రం మొదటి నుంచి చివరి వరకు ఉండి ఆకట్టుకుంది. ఆమె కామెడీ టైమింగ్ చూసిన వారందరూ తెలుగు చిత్ర పరిశ్రమకు మరో హాస్యనటి లభించిందని చెప్పుకుంటున్నారు. “అ..ఆ” లో హరితేజ చక్కగా నటించి..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందని.. ఈ చిత్రం ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకోస్తాయని సినీ పండితులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus