బిగ్ బాస్ షోతో హరితేజ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్ బాస్ షోతో ఎవరైనా బాగా సెటిల్ అయ్యారంటే ఆ లిస్ట్ లో హరితేజ ముందుంటుంది. మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బ్యూటీ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. కొన్ని టీవీ షోలు కూడా చేసింది. సినిమాల్లో కమెడియన్ గా ఓ రేంజ్ కి వెళ్లింది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆమె పాటలకు, హరికథలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా కనిపించింది హరితేజ. ఒక్కో కంటెస్టెంట్ గురించి తన స్టైల్ లో హరికథ రూపంలో చెప్పింది. ఇదిలా ఉండగా.. హరితేజ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. రీసెంట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టింది. ఆల్వేస్ పాజిటివ్ అంటూ ఓ పోస్ట్ చేసింది. పాజిటివ్ అంటే ఇప్పుడు అనుకునే పాజిటివ్ కాదని చెప్పింది.
డోలో అని రాసి.. సారీ బోలో అని క్వశ్చన్ అండ్ ఆన్సర్లా చిట్ చాట్ చేసింది. హరితేజ వెరైటీగా ఈ చిట్ చాట్ ప్లాన్ చేస్తే.. అది కాస్తా బెడిసి కొట్టింది. పలువురు నెటిజన్లు ఆమె జోకులపై సీరియస్ అయ్యారు. లాంటి పరిస్థితుల్లో ఇలాంటి పిచ్చి జోకులు ఏంటంటూ ఆమెపై మండిపడ్డారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా ‘నీకు కరోనా పాజిటివ్ రావాలి’ అంటూ శాపనార్ధాలు పెట్టాడు. అది చూసిన హరితేజ ‘మీకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి..
గాడ్ బ్లెస్’ అంటూ కూల్ గా రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ చాట్ లో చాలా మంది హరితేజ కూతురికి సంబంధించిన ప్రశ్నలే అడిగారు.