Harikrishna: హీరోగా లక్ పరీక్షించుకోనున్న హరికృష్ణ మనవడు.. సక్సెస్ అవుతాడా?

  • March 26, 2024 / 12:37 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలలో చాలామంది హీరోలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే. కొంతమంది హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజవుతున్నాయో కూడా తెలియడం లేదు. అయితే మెగా, నందమూరి ఫ్యామీలీల నుంచి కొత్త హీరో సినిమాల్లోకి వస్తే మాత్రం ఇండస్ట్రీలో కచ్చితంగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) మనవడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

హరికృష్ణకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు కాగా హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ (Janaki Ram) అనే సంగతి తెలిసిందే. 2014 సంవత్సరంలో ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. జానకిరామ్ పెద్ద కొడుకు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. నందమూరి ఫ్యామిలీ అంటే వైవీఎస్ చౌదరికి ఎంతో అభిమానం అనే సంగతి తెలిసిందే.

2015 సంవత్సరంలో విడుదలైన బాలల మూవీ దానవీర శూరకర్ణ సినిమాలో జానకిరామ్ కొడుకు మాస్టర్ ఎన్టీఆర్ గా పరిచయం కావడంతో పాటు కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. జానకిరామ్ పెద్ద కొడుకు సినిమాల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సపోర్ట్ ఉంటే జానకిరామ్ పెద్ద కొడుకు సులువుగానే సినిమాల్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

నందమూరి ఫ్యామిలీ హీరోలు వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మోక్షజ్ఞ కూడా మరికొన్ని నెలల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వరుసగా ఇద్దరు హీరోలు ఎంట్రీ ఇవ్వనుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. తొలి సినిమాలతో నందమూరి యంగ్ హీరోలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి. నందమూరి హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus