“హ్యాట్సాఫ్” రామ్ గోపాల్ వర్మ!!!

  • April 7, 2016 / 07:54 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్క దర్శకుడు ఒక్కో విధమైన విధానంతో ముందుకు సాగుతూ ఉంటాడు. కొందరు దర్శకులు కధ రాసుకోవడంలో మంచి పేరు తెచ్చుకుంటే, మరికొందరు ఆ కధను తెరకెక్కించడంలో మంచి ఖ్యాతిని సంపాదించారు. ఇక కొందరు మ్యూజిక్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. అలా ఎవరికి వారు వారి వారి పరిజ్ఞానం మేరకు టాలీవుడ్ ను మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక వారిలో ఒకడైన మన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తీసేదే చాలా డిఫరెంట్ సినిమాలు, అలాంటి సినిమాల్లో మళ్ళీ పాత్రల విషయంలో ఆయన తీసుకున్న కేర్, ఆయన చూపించే శ్రద్ద బహుశా మరే దర్శకుడు ఇప్పటివరకూ పెట్టి ఉండరేమో. ఆయన ఒక సినిమాలో ముఖ్యమైన పాత్రను మలిచే తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది…..ఉదాహరణకి….‘కిల్లింగ్ వీరప్పన్’ ఫస్ట్ లుక్ చూసి.. వీరప్పన్ చనిపోలేదా తన పేరిట వర్మ తీస్తున్న సినిమాలో నటించడానికి మళ్ళీ వచ్చేశాడా అన్నంత భ్రమ కలిగించాడు. మామూలుగా చూస్తే వీరప్పన్ పోలికలే కనిపించని సందీప్ భరద్వాజ్ ను అచ్చం వీరప్పన్ లా తయారు చేసి తన సత్తా చాటాడు. ఇక ‘ముంబయి ఎటాక్స్ 26/11 ’ సినిమాకు కసబ్ పాత్రధారిని కూడా అలాగే  వెతికి….వెతికీ మరీ పట్టుకొచ్చి అతన్ని కసబ్ లాగా మలిచాడు, ఇక ఇప్పుడు…”వంగవీటి” చిత్రంలో తాను టార్గెట్ చేసిన “వంగవీటి రాధ” పాత్రదారిని ‘రాధ’లాగానే చూపించాడు.

మరో పక్క త్వరలోనే తాను చేస్తున్న ‘గవర్నమెంట్’ సినిమా కోసం వర్మ సెలక్ట్ చేసిన దావూద్ ఇబ్రహీం పాత్రదారి సైతం సేమ్ టూ సేమ్ దావూద్ లాగా ఉండడం చూసి అందరూ ఆర్చర్యానికి గురవుతున్నారు. ఇలా సినిమాలో ప్రధాన పాత్రల విషయంలో వర్మ టాలెంట్ కు నిజంగా మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

1. 26/11 ఇండియా పై దాడి

2. కిల్లింగ్ వీరప్పన్

3. వంగవీటి

4.గవర్నమెంట్

5.వంగవీటి

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus