Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

టాలీవుడ్ దగ్గర రెండు గొప్ప విషయాలు ఉన్నాయి. పక్క రాష్ట్రం నుండి వచ్చిన హీరోయిన్లను బాగా ఆశీర్వదిస్తారు. ఒకవేళ తొలి సినిమా సరైన ఫలితం అందుకోకపోతే రెండో ఛాన్స్‌ ఇచ్చి మరీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇస్తారు. అక్కడా విజయం సాధించకపోతే మరో ప్రయత్నం చేయమ్మా అంటూ ఛాన్స్‌లు కూడా ఇస్తుంటారు. ఈ కోటాలో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలు అందుకుంటున్న అందం కయాదు లోహర్‌. రీసెంట్‌గా ‘ది ప్యాడరైజ్‌’ సినిమాతో దారుణమైన ఫలితం అందుకుంది కయాదు.

Kayadu Lohar

శ్రీ‌విష్ణు ఇంకా కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌గా మారక ముందు ‘అల్లూరి’ అనే యాక్షన్‌ జోనర్‌ సినిమా చేశాడు. ఆ సినిమాలో క‌యాదు లోహర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిను, కయాదును మనవాళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఆ త‌ర‌వాత ఆమె త‌మిళ, మ‌లయాళ సినిమాలతో, కొన్ని వార్తలతో బాగా పాపుల‌ర్ అయ్యింది. అప్పుడు టాలీవుడ్ దృష్టిలో ప‌డింది. విశ్వ‌క్ సేన్‌తో ‘ఫంకీ’ అంటూ వచ్చింది. ఆ సినిమా విశ్వక్‌కు హిట్‌ ఇవ్వలేదు. అయితే కయాదు కావాల్సినంత ఉపయోగపడింది.

ఆ సినిమా తర్వాత సౌత్‌ సినిమాలో వరుస ఛాన్స్‌లు అందుకుంటోంది కయాదు. ఈ క్రమంలో ‘ది ప్యారడైజ్‌’ సినిమా కోసం కాస్త లైన్‌ దాటి మరీ నటించింది. దీని వల్ల మెప్పు కంటే మాటలే ఎక్కువపడింది. వాటి సంగతి పక్కన పెడితే ఆమెకు తెలుగులో సరైన సినిమాలు ఎందుకు రావడం లేదు అనేదే ప్రశ్న. ఆమెకు ఇప్పట్లో అయితే ఛాన్స్‌లు తగ్గే పరిస్థిత లేదు. అయితే ఎవరు నెక్స్ట్‌ సినిమా ఇస్తారు అనేదే ప్రశ్నగా మారింది.

ప్రస్తుతం కయాదు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘తారమ్‌’ అనే మలయాళ సినిమాతోపాటు తమిళంలో ‘మంజనాత్తి’ అనే సినిమా చేస్తోంది. ఇది కాకుండా సూర్య 48వ సినిమా, శివకార్తికేయన్‌ 27 సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్‌. తెలుగులో సరైన కథ పడితే.. ఇక్కడ కూడా అదే స్థాయి ఫేమ్‌ దక్కించుకుంటోంది. కాబట్టి కథల ఎంపిక ఆమెనే జాగ్రత్తగా ఉండాలి.

హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus