కొరటాల ‘టచ్’ చేశాడు!!!

టాలీవుడ్ లో భారీ అంచనాలతో విడుదలయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా తొలి ఆట నుంచే కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సినిమా ప్రభంజనం కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఇదిలా ఉంటే, వచ్చే కొన్ని వారాల వరకూ బడా సినిమాలు ఏమీ లేకపోవడం, వినాయక చవితి సెలవలు కలసి రావడం, లాంగ్ వీకెండ్ పుణ్యమా అని ఎన్టీఆర్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మన కొరటాలను మెచ్చుకుని తీరాల్సిన కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి. తెలివిగలవాడైన మనిషి.. ఈ ప్రపంచాన్ని చాలా విధాలుగా నాశనం చేస్తున్నాడు. మన నేచర్ ను మనమే కాపాడుకోవాలి అని ఇప్పటికీ యునెస్కో తతత వంటి సంస్థలు చాలా ప్రయత్నాలే చేస్తున్నాయి, అవే కాకుండా…పర్యావరణ శాస్త్రవేత్తలు.. పరిరక్షకులు ఎన్నోవిధాలుగా భూమిని కాపాడలనే క్రమంలో విశ్వప్రయత్నాలే చేస్తున్నారు….సరిగ్గా ఆ పాయింట్ నే టచ్ చేశాడు మనోడు.

ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని తీసుకుని ఇలాంటి సున్నితమైన కధను డీల్ చెయ్యాలి అని అనుకోవడం నిజంగా కత్తి మీద సాము లాంటిదే…అయితే ఓవరాల్ గా సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ఒక నేచర్ లవర్ గా ఎన్టీఆర్ ను కొరటాల డిసైన్ చేసిన పనితనం, అదే క్రమంలో ఎన్టీఆర్ తో పలికించిన కొన్ని డైలాగులు సూపర్ అనే చెప్పాలి. ”మనం ఈ భూమి మీద జస్ట్ టెనెంట్స్ (అద్దెకుండే వారం).. తరువాత తరానికి మనం దీనిని జాగ్రత్తగా అప్పజెప్పాలి” అనే మీనింగులో వచ్చే సీన్ అయితే హృదయాన్ని టచ్ చేసింది. అలాగే నీ నా కాదు.. మనం – మనందరిది అనే పాయింట్ ను కూడా బాగా చూపించి సక్సెస్ అయ్యాడు కొరటాల. కాకపోతే కొరటాల స్టైల్ సినిమా కాబట్టి, కాస్త ఎంటర్టైమెంట్ మిస్ అవడంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు…అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా మంచి సినిమా అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus