హేమ ఆంటీ…ఒక రౌండ్ వేసుకుంది!!!

టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్స్లో హేమ గురించి తెలియని వారు ఉండరు. తల్లిగా ఇద్దరు పిల్లలని చూసుకుంటూనే అటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉంటుంది ఈ ప్రముఖ ఆర్టిస్ట్. అయితే ముఖ్యంగా ఈమె బ్రహ్మీతో నటిస్తే ఆ సినిమా హిట్ అయినట్లే అన్న బలమైన నమ్మకం సైతం నిర్మాతలకు ఉంది. ఇదే క్రమంలో ఈమె అటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, అలనాటి తార నిర్మలమ్మ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది…అవేమిటంటే…. ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానం అని చెబుతూనే…. ఎన్టీఆర్ ‘రోబో’ లాంటివాడు అని అంటూ పేజీ డైలాగ్‌ అయినా రోబోలా స్కాన్ చేసి సింగిల్‌ టేక్‌ లో చెప్పే జూనియర్ మెమరీ తనకు షాకింగ్ గా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇక బన్నీ గురించి మాట్లాడుతూ…

బన్నీ ఎనర్జీ అంటే  తనకు ఇష్టం అని అంటూనే రబ్బర్‌ మనిషిలా డాన్స్ లు  చేసే అల్లుఅర్జున్ ను చూస్తే తనకు జెలసీగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేసింది. అదే క్రమంలో హాస్య బ్రహ్మీ గురించి సైతం కొన్ని కామెంట్స్ చేసింది ఈ సీనియర్ ఆంటీ….ఆమె మాట్లాడుతూ….బ్రహ్మానందం, తనది మంచి కాంబినేషన్‌ అని అంటూనే బ్రహ్మానందం తన పాత్రను ఇంప్రూవ్‌ చేస్తూ స్క్రిప్టులో ఉన్న డైలాగ్స్‌కు అదనంగా జోడిస్తే దానికి తాను సరిగ్గా రిటార్ట్‌ ఇవ్వగలుగుతాను కాబ్బట్టే తమ కాంబినేషన్ కు మంచి క్రేజ్ అన్న విషయాన్ని బయట పెట్టింది. ఇక అలనాటి నాటి నిర్మలమ్మలాగా 100ఏళ్లు సినిమా పరిశ్రమలో ఉండిపోవాలి అని ఆశ పడుతున్నా అని చెబుతుంది. మరి అంతకాలం ఈమెను ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందా…చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus