ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సంబంధించి రియల్ వార్తల కంటే ఫేక్ వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. బాలయ్య (Balakrishna) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అఖండ (Ahanda) మూవీ ఒకటి కావడంతో అఖండ సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలయ్య బాబీ (Bobby) మూవీ షూట్ పూర్తైన తర్వాతే బాలయ్య అఖండ సీక్వెల్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అఖండ సీక్వెల్ ఎప్పటినుంచి సెట్స్ పైకి వెళ్తుందో అధికారికంగా క్లారిటీ లేదు.
2025 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన లేదా 2026 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. 2025 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ మంగళవారం కాగా పెద్ద సినిమాలేవీ మంగళవారం రిలీజ్ కావనే సంగతి తెలిసిందే. సాధారణంగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాలు ఎక్కువ రోజులు షూట్ జరుపుకుంటాయి.
అందువల్ల ఏడాదిలోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం సాధ్యమవుతుందని కచ్చితంగా చెప్పలేము. అఖండ (Akhanda 2) సీక్వెల్ రిలీజ్ డేట్ గురించి అధికారికంగా అప్ డేట్స్ వచ్చే వరకు వైరల్ అవుతున్న వార్తలను నమ్మాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. అఖండ సీక్వెల్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
అఖండ సీక్వెల్ లో (Akhanda 2) యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. అఖండ సీక్వెల్ బాలయ్య 110వ సినిమాగా తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. అఖండ సీక్వెల్ లో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.