Tammareddy Bharadwaja: హేమ మీద బ్యాన్‌ ఎత్తివేత.. తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • August 30, 2024 / 05:14 PM IST

ఓ రేవ్‌ పార్టీ విషయంలో జరిగిన వివిధ అంశాల నేపథ్యంలో ప్రముఖ నటి హేమను (Hema) మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తర్వాత పరిణాల్లో భాగంగా ఆమెపై నిషేధం ఎత్తివేశారు. అయితే ఈ విషయంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి. హేమ విషయంలో ‘మా’ వెనక్కి తగ్గడం లాంటిది ఏమీ లేదని చెప్పారాయన. హేమ మీద ‘మా’ నిషేధం ఎత్తివేసినా ఆ వ్యవహారంలో నిందితురాలిగానే ఉందని..

Tammareddy Bharadwaja

తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) గుర్తు చేశారు. చట్టం దృష్టిలో నిందితుడు వేరు, నేరస్థుడు వేరు. నేరం నిరూపణ అయ్యే వరకు ఆమె నిందితురాలే. ఆమెను అరెస్టు చేశారు కాబట్టి, ‘మా’ సభ్యత్వం రద్దు చేశారు, బెయిల్ వచ్చింది కాబట్టి నిషేధం ఎత్తేశారని ఆయన చెప్పారు. నిజా నిజాలు తెలిసేంత వరకు ఆమె నిందితురాలిగానే ఉంటుందన్నారు. విచారణలో హేమ నేరస్థురాలు అని తేలితే మళ్లీ సభ్యత్వం తొలగిస్తారుఅని భరద్వాజ చెప్పారు.

అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో ఇప్పటివరకు టాలీవుడ్‌లో హేమ మినహా ఎవరూ అరెస్టు కాలేదని భరద్వాజ చెప్పారు. డ్రగ్స్ విషయంలో చాలా మంది నటీనటులు విచారణకు వెళ్లారు కానీ, ఎవరూ అరెస్టు కాలేదు. హేమ మాత్రమే అరెస్టు అయ్యారు. డ్రగ్స్ తీసుకుంటే జైల్లో పెడతారా? పెట్టరా? అనేది నాకు తెలియదు అన్నారు తమ్మారెడ్డి ఒకవేళ డ్రగ్స్‌ తీసుకునప్పుడు కేసు పెడితే, జైల్లో పెడితే ఈ కేసులో ఉన్న వాళ్లందరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు 15 ఏళ్ల నుండి నడుస్తోంది. ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి పిలుస్తారు. విచారణ జరుపుతారు, ఆ వార్తలు మీడియాలో చూపిస్తారు. కానీ ఇంతవరకు ఆ కేసు తేలలేదు. విచారణకు వచ్చిన వాళ్లు నవ్వుతూ విక్టరీ సింబల్స్ చూపిస్తూ వెళ్తారు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

బాలకృష్ణ తొలి సినిమాకు 50 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus