ఇప్పుడంటే ఏం సినిమా చూడాలా అనే థాట్ వచ్చినప్పుడు వెంటనే గూగుల్ లో సర్చ్ చేస్తుంటాం కానీ.. ఇదివరకూ ఏదైనా సినిమా చూడాలి అంటే ఐ.ఎం.డి.బి ఓపెన్ చేసి అందులో సినిమా డీటెయిల్స్ తోపాటు రేటింగ్ కూడా చెక్ చేసి మరీ సినిమాలు చూస్తుంటాం. అలాంటి స్టేటస్ కలిగిన ఐ.ఎం.డి.బి టాప్ 10 లిస్ట్ లో మన తెలుగు సినిమాలు రెండు నిలవడం అనేది ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ గర్వకారణం. ఆ రెండు సినిమాల్లో మొదటిది ప్రేక్షకలోకం నీరాజనం పలికిన “మహానటి”. సావిత్రి బయోపిక్ గా నాగఅశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల ప్రజాల్నే కాదు యావత్ ప్రపంచలోని సినిమా అభిమానులను విశేషంగా అలరించింది.
ఇక రెండోది ప్రేక్షకులని విస్మయానికి గురిచేసిన “రంగస్థలం”. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్ చరణ్ లోని నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయడమే కాక చాలారోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు నేటివిటీతో ఉన్న తెలుగు సినిమా చూసిన భావన కలిగింది.
ఐ.ఎం.డి.బి ప్రకటించిన కంప్లీట్ లిస్ట్ ఇక్కడ చూద్దాం..
1. అంధాదున్ (హిందీ)
2. రట్సాసన్ (తమిళం)
3. 96 (తమిళం)
4. మహానటి (తెలుగు)
5. బడాయి హో (హిందీ)
6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)
7. రంగస్థలం (తెలుగు)
8. స్ట్రీ (హిందీ)
9. రాజీ (హిందీ)
10. సంజు (హిందీ)