ముందు నేను అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు!
- May 27, 2018 / 11:35 AM ISTByFilmy Focus
ఒక్కోసారి చేయకూడదనుకొన్న పనులు చేస్తే రిజల్ట్ మనకు తెలియకుండానే తేడా కొట్టేస్తుంది. ప్రస్తుతం మన యాక్షన్ కీంగ్ అర్జున్ పరిస్థితి అందుకు నిదర్శనం. నిజానికి మొదట్లో ఆయన “నా పేరు సూర్య” సినిమాలో రోల్ ఆఫర్ చేసినప్పుడు చేయకూడదు అనుకొన్నాడట. కానీ.. క్యారెక్టర్ ఎక్స్ ప్లేన్ చేసిన తర్వాత నచ్చి నటించాడట. అయితే.. ఇప్పటివరకూ ఆయన ఇంకా “నా పేరు సూర్య” సినిమా చూడలేదట. ఒక నటుడిగా నాకున్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ అదేనని చెప్పుకొచ్చాడు అర్జున్.
ఆయన ప్రతినాయకుడిగా నటించిన “అభిమన్యుడు” జూన్ 1న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తాను స్వయంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. త్వరలోనే మళ్ళీ మంచి యాక్షన్ సినిమా డైరెక్ట్ చేస్తున్నట్లు కూడా వివరించారు అర్జున్.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















