టాలీవుడ్లో కామెడీ సినిమాలు తీయాలంటే… ఆ డైరక్టర్ ఒకప్పుడు హాట్ ఫేవరెట్. అదే కామెడీ సినిమాలను ఫ్యామిలీ ఎమోషన్లతో జోడించి అదరగొట్టాలంటే ఆ హీరోను మించి ఆప్షన్ లేదు. అయితే ఇటీవల కాలంలో ఆ డైరక్టర్‌కు లక్ పని చేయడం లేదు, సినిమాలు తేడా కొడుతున్నాయి. ఇక ఆ హీరో ఆ జోనర్ నుండి బయటకు వచ్చేసి యాక్షన్ సినిమాలు తీసి ఇబ్బందిపడుతున్నాడు. ఇవన్నీ లెక్కలేశారో ఏమో.. ఇప్పుడు ఆ ఇద్దరూ కలవబోతున్నారు అని టాక
పైన చెప్పిన మాటల్లో దర్శకుడు (Srinu Vaitla) శ్రీను వైట్ల అయితే, హీరో గోపీచంద్. చాలా కాలంగా ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఎక్కడా అధికారిక సమాచారం రాలేదు కానీ ఓ మూడు నెలల క్రితం ఈ సినిమా ఇక ఉండదు అని తెగదెంపుల పుకార్లు కూడా వచ్చేశాయి. మళ్లీ ఏమైందో ఏమో… ఇద్దరూ కలసి సినిమా చేస్తారు అంటూ తాజాగా లీక్‌లు ఇస్తున్నారు. ‘రామబాణం’తో ఇటీవల వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్న గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా శ్రీను వైట్లతో చేస్తారు అంటున్నారు.
టాలీవుడ్లో శ్రీను వైట్ల స్టార్ డైరక్టర్‌గా వెలుగొందారు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్‌కు దీటుగా క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు. అయితూ ఒకే తరహా కామెడీ, కథలతో ఇబ్బందిపడి కెరీర్‌ను రిస్క్‌లో పెట్టేసుకున్నారు. ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి డిజాస్టర్లు ఇచ్చారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఎఫెక్ట్ ఎంతగా పడింది అంటే… ఆ సినిమా వచ్చి ఐదేళ్లు అవుతున్నా కొత్త సినిమా ఇంకా మొదలవ్వలేదు. ఈ లోపు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చుట్టుముట్టాయి.
ఇప్పుడు వాటన్నింటిని పక్కనపెట్టి గోపీచంద్ సినిమాను షురూ చేస్తారు అంటున్నారు. ఈ సినిమా మొత్తం వినోదంతో నిండిపోతుంది అంటున్నారు. ఈ సినిమా అనుకున్నట్లుగా మొదలైతే మంచు విష్ణుతో ప్రకటించిన ‘ఢీ అంటే ఢీ’ ఇక ఇప్పట్లో లేనట్లే అని అర్థం చేసుకోవచ్చు.