Gopichand, Hari: ‘సింగం’ సినిమా డైరక్టర్‌తో గోపీచంద్‌ సినిమా చేస్తాడా?

  • April 6, 2022 / 12:34 PM IST

‘సింగం’ సినిమా సిరీస్‌ గుర్తుందా? ఎందుకు లేదు సినిమాలో సూర్య యాక్షన్‌, అరుపులు, ఆ ఊపు ఎలా మరచిపోతాం అంటారా! అయితే అలాంటి యాక్షన్‌ నచ్చేవారికి, అరుపులు, కేకలు ఇష్టపడేవారికి గుడ్‌ న్యూస్‌. ‘సింగం’ దర్శకుడు హరి తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో గోపీచంద్‌ సినిమాను అనౌన్స్‌ చేస్తారని టాక్‌. ‘సింగం’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హరి.. ఇటీవల గోపీచంద్‌ను కలసి ఓ సినిమా కథ చెప్పారట.

పాయింట్‌ నచ్చిన గోపీచంద్‌.. కథను డెవలప్‌ చేయమని చెప్పారని అంటున్నారు. ఒకవేళ అంతా ఓకే అయితే… త్వరలో సినిమాను అనౌన్స్‌ చేస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా ప్రైమరీ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి పూర్తిగా ప్రాజెక్ట్‌ ఓకే అవుతుందని చెప్పలేం. అయితే సినిమా ఉంటుందనే బజ్‌ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. హరి ఆఖరిగా 2018లో ‘సామి 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మరో సినిమా చేయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది.

ఇప్పుడు ‘యాన్నాయ్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అందులో అరుణ్‌ విజయ్‌, సముద్రఖని, ప్రకాశ్‌ కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. ‘సామి’ సినిమాతో మాస్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరి… ఆ తర్వాత వరుసగా మాస్‌ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. సూర్యతో ‘సింగమ్‌’ సిరీస్‌ మొదలయ్యాక.. స్టార్‌ డైరక్టర్ అయిపోయారు. అలా ఈ సిరీస్‌లో మూడు సినిమాలు చేశారు.

అయితే మూడో ‘సింగం’ ఆశించిన మేర విజయం సాధించలేదు. దీంతో నాలుగో ‘సింగం’ రాలేదు. గతంలో ఈ సినిమా గురించి రూమర్స్‌ వచ్చినా.. వర్కవుట్ కాలేదు. దీంతో గోపీచంద్‌కి కథ చెప్పారని టాక్‌. అన్నట్లు ఇది కూడా పోలీసు కథే అని సమాచారం. ఇక హెడ్డింగ్‌లో గొంతు బొంగురుపోయేలా అన్నారేంటి అనుకుంటున్నారా. ‘సింగం’ స్టైల్‌లో గోపీచంద్‌ అరిస్తే గొంతు బొంగురుపోవడం పక్కా. అందుకే అలా అన్నాం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus