కంటెంట్ వుంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు – “ఉపేంద్ర గాడి అడ్డా” హీరో కంచర్ల ఉపేంద్ర

కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కంచర్ల ఉపేంద్ర ఇంటర్వూలో విలేకరులతో మాట్లాడారు.

– కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.

– ఓ రోజు వైజాగ్ కళాకారుల పిక్నిక్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను. అక్కడ నన్ను చూసి ఓ దర్శకుడు కథ చెప్పడం, సినిమాలోకి రావడం జరిగింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు మొదట సినిమా మొదలైంది. ఆ తర్వాత అక్టోబర్ లో మరో సినిమా మొదలైంది.

– ఇక ఉపేంద్ర అడ్డా యూత్ ఫుల్, మాస్, ఎంటర్ టైనర్ గా రూపొందించాం. ప్రతివారూ కనెక్ట్ అవుతారు. సోషల్ మీడియాను యూజ్ చేసేవారు కూడా ఈ సినిమా గురించి తెలుసుకుంటారు.

– ఈ సినిమాలో నా పేరు ఉపేంద్ర. నేను పుట్టిన అడ్డాలో కథ మొదలవుతుంది. అందుకే టైటిల్ పెట్టాం. కథ పరంగా డిమాండ్ కూడా చేసింది. నా చుట్టూనే కథ తిరుగుతుంది.
– ఇందులో ఓ చక్కటి సందేశం కూడా వుంది. ఫోన్ వుంటే, దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఎటువంటి మంచి చెడులు అనేవి చూపాం. మహిళలు ఏ విధంగా వీటిని యూజ్ చేస్తున్నారు. ఇక సమాజంలో విలువలు ఏ విధంగా వుంటాయి అనేవి చూపించాం.

– ఉపేంద్ర అనే పేరు చిన్నతనంలో మా తల్లిగారు పెట్టారు. ఈ పేరుతో పలువురు ఫేమస్ వారు వున్నారు. ఆ స్థాయిలో నీ కెరీర్ వుంటుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఇలాంటి పేరు తక్కువ.. నా కంటూ శైలి ఇందులో వుంది.

– నాకు చదువుకునే టైంలో నే హీరో అవ్వాలని వుండేది. ఇంట్లో కూడా నా ప్యాషన్ ను ఎంకరేజ్ చేశారు. నటనలో శిక్షణ కూడా పెద్దగా తీసుకోలేదు. కానీ నా పట్టుదల చూసి మంచి ప్రయత్నం అని అందరూ మెచ్చుకున్నారు. తోటి ఆర్టిస్టులు కూడా మెచ్చుకున్నారు.
– వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నటన కొద్దిగా నేర్చుకున్నా. ఆ తర్వాత నా కొచ్చిన కాన్ఫ్ డిన్స్ తో ముందుకు సాగాను.
– నేను కొత్త హీరోను. ఒకేసారి ఆరు సినిమాలు చేయడం అద్రుష్టమే అని చెప్పాలి. నాకున్న టీమ్ కూడా మంచి సహకరించారు.
– మా నాన్నగారు 11 సినిమాలు చేయాలని నాన్నగారు నియమం పెట్టుకున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలు 70 శాతం పూర్తయ్యాయి.
– ప్రస్తుతం “1920 భీమునిపట్నం” సినిమా రన్నింగ్లో వుంది. ఇలా కొత్త దర్శకులను, నటీనటులను ప్రోత్సహించాలనే నిర్మాణ సంస్థను స్థాపించాం.
– నాన్నగారు నిర్మాణంతోపాటు పలు సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ తో పలు సేవా కార్యక్రమాలను నాన్నగారు చేస్తున్నారు.

– ఇక కంచర్ల, సినిమా కథ మా తాతలు చేసిన భూదానం నేపథ్యంలో సినిమా వుంటుంది. అలాగే సైంటిస్ట్ కథతో మరో సినిమా. ఐ.పి.సి. కథలో మరో సినిమా రన్నింగ్ లో వున్నాయి. ఉపేంద్ర గాడి అడ్డా కూడా కథ ప్రకారమే పెట్టాం.

– ఉపేంద్ర అడ్డా దర్శకుడిలో క్రియేటివిటీ వుంది. తను చెప్పినట్లు తీయగలిగాడు.
– ఇందులో నాలుగు పాటలున్నాయి. హీరోయిన్ బెంగుళూరు అమ్మాయి. కొత్త పాత కలయికతో ఈ సినిమా చేశాం.
– ఉపేంద్ర అడ్డా అనేది కొత్త సినిమా అనికాకుండా మంచి సినిమా చేయడానికే తీశాం.
– మా సినిమాతోపాటు యానిమల్ వంటి సినిమాలు విడుదలవుతున్నాయి.అన్ని ఆడాలని కోరుకుంటాను. కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఎటువంటి సినిమా కైనా థియేటర్ కు వస్తారు.

– చిరంజీవి, ఎన్.టి.ఆర్., పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కో హీరోలో ఒక్కో ప్రత్యేకత వుంటుంది. అందరూ మంచి హీరోలే. నాకంటూ ఓ ప్రత్యేక వుంది. అధి సినిమా చూస్తే అర్థమవుతుంది.

– నరసింహ నందిగారితో కూడా మంచి సినిమా చేస్తున్నా.మిగిలిన దర్శకులు కూడా టాలెంటెడ్ పర్సన్సే.
– సంక్రాంతికి నా తదుపరి సినిమాలు రిలీజ్ అవుతాయి. అన్ని తరహా పాత్రలు చేయాలనుంది. ఫలానా మార్క్ అనేది నాకు లేదు.
– కొత్తవారిని ఆదరించాలి. అలా ఆదరించాలంటే కంటెంట్ సినిమాలు తీయాలి. ఆ దిశగా మేం సినిమాలు చేస్తున్నాం అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus