Karthi: ‘సత్యం సుందరం’.. కలెక్షన్స్ గురించి వర్రీ అవుతున్న కార్తీ!

కార్తీ (Karthi) – అరవింద్ స్వామి  (Arvind Swamy) కాంబినేషన్లో రూపొందిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram)  సినిమా సెప్టెంబర్ 28న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా చూసి చాలా మంచి టాక్ చెప్పారు. అయితే ‘దేవర’ (Devara) పక్కన రిలీజ్ అవ్వడం వల్ల ప్రేక్షకులు దీనిని చిన్న చూపు చూస్తున్నారు. అంతేకాదు చాలా మంది ‘సత్యం సుందరం’ .. ఓ ఫీల్ గుడ్ మూవీ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.

Karthi

సాధారణంగా ఫీల్ గుడ్ మూవీ అని చెబితే.. అది ‘ఓటీటీ సినిమా’ అని కొంతమంది ఫిక్స్ అయిపోతున్నారు. దీంతో థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. కార్తీకి కూడా అదే భయం కలిగినట్టు ఉంది. అందుకోసమే ఓపెన్ అయిపోయాడు. ఈరోజు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ” ‘సత్యం సుందరం’ కి విమర్శకుల నుండి చాలా మంచి టాక్ వచ్చింది. సంతోషమే.! అయితే పొగడ్తలతో సరిపెట్టేయకూడదు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా రావాలంటే కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకోవాలి.

నా కోసం కాదు.. ఇలాంటి మంచి సినిమాలు తీయాలనుకునే ఫిలిం మేకర్స్ కోసం ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ కాకుండా చూడండి’ అంటూ చెప్పుకొచ్చాడు. కార్తీ చెప్పింది కూడా పాయింటే..! ‘సత్యం సుందరం’ వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.వాటిని ఓటీటీకి పరిమితం చేయకుండా థియేటర్స్ లో చూస్తే.. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తుంటాయి.

ఆ సమయంలో చాలా బాధ పడ్డానన్న పవన్ తల్లి.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus