Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ… కేటీఆర్ ఇష్యూకి సినీ ప్రముఖులని లింక్ చేయడం పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా నాగార్జునపై, ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలపై మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ‘నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్..! మీ ఎన్.కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అంటే సమంతని తన వద్దకి పంపమని నాగార్జున, నాగ చైతన్య..ల పై ఒత్తిడి చేశాడు కేటీఆర్.

Nagarjuna

వాళ్ళు సమంతని కేటీఆర్ వద్దకు వెళ్ళమని ఫోర్స్ చేశారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ కారణం వల్లే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అంతేకాదు చాలా మంది సినిమా హీరోయిన్లకి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్. అందుకే హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతున్నారు’ అంటూ మంత్రి కొండా సురేఖ… కేటీఆర్ పై ఘోరమైన వ్యాఖ్యలు చేసింది. వీటిని నాగార్జున తీవ్రంగా ఖండిస్తూ ఓ ట్వీట్ వేశారు.

ఆ ట్వీట్ ద్వారా నాగార్జున (nagarjuna) స్పందిస్తూ.. “గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి.

దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసుకొచ్చారు.

మరోసారి పెళ్లి చేసుకోబోతున్న ఫైర్‌ బ్రాండ్‌ వనిత.. నిజమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus