Devara: ‘దావుది’ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన ‘దేవర’ నటి..!

ఎన్టీఆర్ (Jr NTR)  – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’  (Devara)ఇటీవల అంటే సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదలై… మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.దర్శకుడు కొరటాల శివ టేకింగ్.. ఎన్టీఆర్ నటన, అనిరుథ్ (Anirudh Ravichander) బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ కలగలిపి ‘దేవర’ ని సూపర్ హిట్ మూవీగా నిలబెట్టాయి అని చెప్పాలి.

Devara

అయితే ఒక్కటే లోటు. అదేంటంటే.. విడుదలకి ముందు ‘దేవర’ నుండి ‘దావూది’ అనే పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్..ల మధ్య వచ్చే డ్యూయెట్ లా.. ఈ పాట ఉంది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  , ఎన్టీఆర్..లు పోటీపడి మరీ ఈ పాటలో చిందులు వేశారు. ఈ పాట థియేటర్లలో అదరగొట్టేస్తుంది.. అందరికీ మంచి ఫీల్ ఇస్తుంది అని అంతా భావించారు. కానీ కట్ చేస్తే.. ఈ పాట ‘దేవర’ సినిమాలో కనిపించలేదు.

ఈ క్రమంలో కేవలం ప్రమోషన్ కోసమే ఈ పాటని వాడుకున్నారేమో అని అంతా అనుకున్నారు. అయితే ఈ పాటని త్వరలోనే యాడ్ చేసే అవకాశం ఉందని.. ఈ సినిమాలో జాన్వీ తల్లి పాత్ర పోషించిన నటి మణిచందన (Mani Chandana) చెప్పుకొచ్చారు. రిలీజ్ కి ముందు జాన్వీ ‘దేవర’ కి సంబంధించి పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు గమనిస్తే.. అవి సినిమాలో లేవు. వీటి గురించి మణిచందనని ప్రశ్నించగా.. ‘కొన్ని సీన్స్ కట్ అయ్యాయి.

అవి పార్ట్ 2 లో ఉంటాయి’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ‘దావూదీ’ సాంగ్ కూడా సెకండ్ పార్ట్..లోనే ఉంటుందా? అని ప్రశ్నించగా.. ‘ ‘దావూదీ సాంగ్ మరో రెండు, మూడు రోజుల్లో(అంటే దసరా హాలిడేస్) కి యాడ్ చేస్తారు. 90 శాతం దావూదీ సాంగ్ యాడ్ చేస్తారు. లేదు అంటే సెకండ్ పార్ట్..లో ఉంటుంది’ అంటూ క్లారిటీ ఇచ్చింది నటి మణిచందన.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus