కార్తీ ‘దేవ్’… సెన్సార్ రిపోర్ట్..!

కార్తీ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రజత్ రవిశంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవ్’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ తో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది ఈ చిత్రం. హారీస్ జైరాజ్ సంగీతమందించిన ఈ చిత్ర పాటలకి కూడా మంచి ఆదరణ లభించింది. తెలుగులో కూడా కార్తీకి మంచి మార్కెట్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానిని దృష్టిలో పెట్టుకునే తమిళ్ తో పాటూ తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఇక కాలంలో విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

ఈచిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ను జారీ చేసారు సెన్సార్ బోర్డు సభ్యులు. సరికొత్త కాన్సెప్ట్ తో రజత్ రవిశంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. రవిశంకర్ కి ఇదే మొదటి చిత్రమైనప్పటికీ… చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ఈ చిత్రంలో కార్తీ న్యూ లుక్ కలిపించాడట. హీరోయిన్ రకుల్ కి ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉందట. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట. అయితే సెకండ్ హాఫ్ మొదట్లో కొంచెం నెమ్మదించినప్పటికీ… తరువాత స్పీడ్ అందుకుంటుందని… ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఆసక్తిగా సాగుతుందని సమాచారం. ముఖ్యంగా అడ్వెంచర్ ఎలెమెంట్స్, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, కార్తీ, రకుల్ నటన ప్లస్ పోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ మొదట్లో కొంచెం ల్యాగ్ ఉండటం, కామెడీ వంటి వాటిని మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చట.

ఇక ఈ చిత్ర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ – అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుండీ ఈ వేడుక జరుగబోతోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల కాబోతుంది. కార్తీ – రకుల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఖాకీ’ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేయడంతో.. ఈ చిత్రం పై కూడా మంచి క్రేజ్ నెలకొంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus