వై.ఎస్.ఆర్ బయోపిక్ లో కీలకపాత్రలో కార్తీ!

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి చాలా కాలం తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం “యాత్ర”. యువ దర్శకుడు మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రంలో అతి కీలకమైన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాత్రకు తమిళ యువ కథానాయకుడైన కార్తీ ని ఎంపిక చేసినట్టు సమాచారం. సూర్య కుటుంబానికి జగన్ కి మంచి స్నేహం ఉండడంతో కార్తీ జగన్ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాడట. అయితే ఈ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో వైఎస్ రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు, సబితా ఇంద్ర రెడ్డిగా సుహాసిని, సూరీడుగా పోసాని, వైఎస్ మిత్రుడు కేవీపీ పాత్రలో రావురామేష్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus