Hero Nani: చిరు, బాలయ్య సినిమాల రికార్డులను బద్దలు కొట్టిన నాని సినిమా!

  • March 31, 2023 / 07:54 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. నాని ఎంతో ఇష్టపడి,కష్టపడి చేసిన సినిమా ఇది. ‘అంటే సుందరానికీ’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేక డిజాస్టర్ అయ్యింది. దీంతో ‘దసరా’ సినిమా సక్సెస్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు నాని. టీజర్, ట్రైలర్, పాటలు నాని  కాన్ఫిడెన్స్ పై అలాగే ‘దసరా’ సినిమా పై నమ్మకం పెంచాయని చెప్పాలి.

ఇక నిన్న రిలీజ్ అయిన (Nani) ‘దసరా’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘అంటే సుందరానికీ’ చిత్రం ఫుల్ రన్లో సాధించిన కలెక్షన్లు ఈ చిత్రం మొదటి రోజే కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అంతే కాదు ‘దసరా’ సినిమా మరో రికార్డుని కూడా సొంతం చేసుకుంది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు మొదటి రోజు నైజాంలో సాధించిన కలెక్షన్లను ‘దసరా’ సినిమా క్రాస్ చేసేసింది.

బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం నైజాంలో మొదటి రోజు రూ.5.18 కోట్ల షేర్ ను సాధించింది. ఇక చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నైజాంలో మొదటి రోజు రూ.6.05 కోట్లు షేర్ ను సాధించింది. ఇక ‘దసరా’ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.6.75 కోట్ల షేర్ ను సాధించింది.

ఆ రెండు చిత్రాలను ‘మైత్రి’ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయగా, ‘దసరా’ చిత్రాన్ని దిల్ రాజు నైజాంలో రిలీజ్ చేయడం జరిగింది. దిల్ రాజు ఓ సినిమాని రిలీజ్ చేస్తే దానికి ఏ స్థాయి వస్తుందనేది ‘దసరా’ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. మరి ఫుల్ రన్లో ‘దసరా’ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus