న్యాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. మరో వారం రోజుల్లో దసరా సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దసరా మూవీ 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నాని మార్కెట్ ను డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
సక్సెస్ అనేది ఓవర్ రేటెడ్ అని నాని చెప్పుకొచ్చారు. నా సినిమాలనే ఉదాహరణలుగా తీసుకుంటే ఒక సినిమా కోసం నేను చాలా కష్టపడ్డానని కాన్ఫిడెన్స్ తో ఉన్నానని కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని నాని తెలిపారు. మరో సినిమా యావరేజ్ గా నిలుస్తుందని భావించగా ఆ మూవీ పెద్ద హిట్ గా నిలిచిందని నాని కామెంట్లు చేయడం గమనార్హం. యావరేజ్ అవుతుందని నాని భావించి హిట్టైన సినిమా ఎంసీఏ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎంసీఏ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల కాగా ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. నాని దసరా సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో లేదో చూడాలి. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారనే సంగతి తెలిసిందే.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ల జాబితాలో శ్రీకాంత్ కూడా చేరే అవకాశాలు అయితే ఉంటాయి. నాని రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా టైర్2 హీరోలలో ఈ రేంజ్ పారితోషికం అందుకుంటున్న హీరో నాని మాత్రమేనని చెప్పవచ్చు. నాని ఇతర హీరోలకు భిన్నంగా కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో అడుగులు వేస్తుండటం గమనార్హం.
హీలీవుడ్లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?