Nithiin: నితిన్ మనసులో మాట బయట పెట్టాడు..!

  • November 7, 2024 / 05:19 PM IST

మన యూత్ స్టార్ నితిన్ (Nithiin) .. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.‘అమరన్’ (Amaran) మూవీ సక్సెస్‌మీట్ వేదికగా నితిన్ ఈ కామెంట్స్ చేశాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్  (Sivakarthikeyan), సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలయ్యింది. ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వంద కోట్లు పైనే కలెక్ట్ చేసింది.

Nithin

తెలుగులో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. దీంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ (Nithiin) తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. దీంతో అమరన్ సక్సెస్‌మీట్‌ కి నితిన్ గెస్ట్ గా రావడం జరిగింది. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ… ” ‘అమరన్’ సినిమా అద్భుతం. ఈ మూవీ విజయంలో సాయి పల్లవి పాత్ర చాలా ఉంది. ఆమె డ్యాన్స్ అంటే నేను పడి చచ్చిపోతాను. ఆమెతో కలిసి డ్యాన్స్ చేయాలనే కోరిక నాకు ఉంది.

త్వరలోనే ఆమెతో కలిసి స్టెప్పులు వేసే రోజు రావాలని కోరుకుంటున్నాను.శివ కార్తికేయన్, నేను చాలా మంచి స్నేహితులం” అంటూ చెప్పుకొచ్చాడు. సాయి పల్లవిపై   నితిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.నితిన్ (Nithiin) కూడా మంచి డాన్సర్.సాయి పల్లవి పక్కన అతను బాగానే సెట్ అవుతాడు. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదు. మరి ఈ కాంబోని సెట్ చేయబోయే దర్శకుడు, నిర్మాత.. ఎవరవుతారో చూడాలి..!

‘లక్కీ భాస్కర్’ ..అక్కడ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus