Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ ..అక్కడ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదా?

‘సీతా రామం’  (Sita Ramam)  తర్వాత దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)   నుండి వచ్చిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar). దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారం అద్భుతంగా కలెక్ట్ చేసింది. వెంకీ అట్లూరి  (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. చాలా వరకు రిలేటబుల్ కంటెంట్ అది. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేసింది.

Lucky Baskhar Collections:

తమిళనాడు, కేరళ వంటి ఏరియాల్లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఓవర్సీస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.72 cr
సీడెడ్ 1.64 cr
ఆంధ్ర(టోటల్) 5.42 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 13.78 cr
తమిళనాడు 1.78 cr
కేరళ 4.65 cr
హిందీ 0.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.45 cr (తెలుగు వెర్షన్ )
ఓవర్సీస్ 6.60 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
వరల్డ్ వైడ్ (టోటల్ ) 27.63 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి వారం రూ.14.30 కోట్ల షేర్ ను రాబట్టి రూ.2.8 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.27.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus