‘ఆమె’ కోసం నితిన్ ఎదురుచూపు

ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అఆ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ విడుదలయిన ఆ సినిమా ట్రైలర్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నితిన్ నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే క్రమంలో తన కరియర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ‘అఆ’ తరువాత గుండెజారీగల్లంతయ్యింది సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు మన హీరో.

అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా ముందు అందాల భామ, నితిన్ లక్కీ గర్ల్ నిత్య మీనన్ అనుకున్నారు కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల మరో భామను ఎంచుకునే క్రమంలో దర్శకనిర్మాతలు శ్రుతి హసన్ పై మనసు పారేసుకున్నారు. అందరి స్టార్ హీరోయిన్స్ తో రొమ్యాన్స్ చెయ్యాలి అనుకునే నితిన్ ఇప్పటికే త్రివిక్రమ్ పుణ్యమా అని సమంతతో ‘అఆ’ లో రొమ్యాన్స్ చేశాడు. ఇక విజయ్ కుమార్ కొండతో చేస్తున్న సినిమాలో పొడుగు కాళ్ళ సుందరి శ్రుతితో ఆడిపాడితే, ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో నితిన్ చెయ్యాల్సింది ఒక్క తమన్నాతోనే. ఇదే క్రమంలో శృతి హాసన్ కూడా శ్రీమంతుడు తర్వాత ఏది కమిట్ అవ్వలేదు. చైతు ప్రేమంలో చేస్తుంది కాని ఆమె కాకుండా మరో ఇద్దరు భామలు అందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి నితిన్ ఇచ్చిన ఆఫర్ ను శృతి కన్ఫర్మ్ చేస్తుందో లేదో చూడాలి. మరి సినిమాకు కలర్ఫుల్ తెచ్చే హీరోయిన్ విషయంలో నితిన్ చొరవ చూపించడం ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus