ప్రభాస్ ఫిట్ నెస్ సీక్రెట్స్

  • October 22, 2019 / 08:57 PM IST

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బాహుబలి ఫీవర్ ఉంది. ఈ సినిమా చూసిన వారందరూ ప్రభాస్ కి ఫ్యాన్ అయిపోతున్నారు. అమ్మాయిలు అతని ప్రేమలో పడిపోతుంటే, అబ్బాయిలు అతనిలా బాడీని ఎలా మైంటైన్ చేయాలో తెలుసుకునే పనిలో పడ్డారు. అందుకే ప్రభాస్ ఫిట్ నెస్ రహస్యాలను ఫిల్మ్ ఫోకస్ సేకరించింది. అంతేకాదు.. ప్రభాస్ తన అభిమానులకు చెప్పిన సలహాలు సూచనలు కూడా మీకు అందిస్తోంది.

1 . రోజుకి ఆరుగంటలుబాహుబలి సినిమాకోసం గత ఐదేళ్లుగా ప్రభాస్ రోజుకి ఆరు గంటలు వ్యాయామం చేశారు. కేవలం కార్డియో కోసమే ఒకట్టిన్నర గంట కేటాయించేవారు. మరో కండరాల గట్టిదనం కోసం ఒకట్టిన్నర గంట పాటు బరువులు ఎత్తేవారు.

2 . WWE వాళ్లే ఆదర్శం WWE లో పోటీ పడే రెజ్లర్లు ప్రభాస్ కి స్ఫూర్తి. వారు ఏవిధంగా వ్యాయామం చేస్తుంటారో, ఎటువంటి ఆహరం తీసుంటుంటారో ఫాలో అవుతుంటారు.

3 . స్ట్రిక్ట్ డైట్బాహుబలి షూటింగ్ సమయంలో స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యారు. బ్రేక ఫాస్ట్ కి 40 ఎగ్ వైట్స్ తీసుకునేవారు. భోజనం ఆరు సార్లు తీసుకునేవారు. ప్రతి రెండు గంటలకు ఒక సారి ఆహారం తీసుకునేవారు. అందులో నట్స్, వెజిటేబుల్స్, చేప, గుడ్లు ఎక్కువగా ఉంటాయి.

4 . రైస్ తక్కువబాహుబలి కంటే ముందు నుంచే ప్రభాస్ బాడీని ఫిట్ గా ఉంచుకునేవారు. అందుకోసమే ఇంట్లో చిన్నపాటి జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సినిమాలో వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు. తన ఆహారంలో అప్పుడు, ఇప్పుడు అన్నం తక్కువగా ఉంటుంది. బాహుబలి తర్వాత కూడా డైట్ , ఎక్సర్ సైజ్ లో మార్పు ఉండదు.

5 . ట్రైనర్ తప్పనిసరితనని చూసి యువకులు ఇష్టమొచ్చిన్నట్లు బరువులు ఎత్తవద్దని ప్రభాస్ చెప్పారు. ఒక క్రమపద్ధతిలో బరువులు ఎత్తాలని, అది కూడా మంచి శిక్షకుడి పర్యవేక్షణలో వ్యాయామాలు చేయాలనీ సూచించారు.

6. స్టెరాయిడ్స్ వద్దుతొందరగా కండలు రావాలని స్టెరాయిడ్స్ జోలికి వెళ్లవద్దని యువతను ప్రభాస్ హెచ్చరించారు. డ్రగ్స్ వాడడం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించారు.

7. అతి వద్దుమూడు వచ్చిందని ఒక రోజులో ఎక్కువ గంటలు, పని ఉందని కొన్ని సార్లు జిమ్ వెళ్లకుండా ఉండడం బాడీకి మంచిది కాదని సూచించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus