తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంగ్రీమెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని హీరోగా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రాజశేఖర్ ఒకరు. ఈయన పోలీస్ పాత్రలలో నటించారంటే వెండితెరపై ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అంతలా ఈయన తన నటనతో మెప్పించారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన హీరోగా కాకుండా నెగటివ్ పాత్రలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రాజశేఖర్ తన పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు దేవుడంటే అసలు నమ్మకం లేదని తెలిపారు. అయితే తాను తనకంటే వయసులో పెద్దదైనటువంటి ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి తనకు నో చెప్పడంతో బాగా తాగుడికి కూడా బానిస అయ్యానని తెలిపారు. ఇలా ఒకరోజు ఫుల్లుగా తాగడంతో నా స్నేహితుడు నీకు దేవుడు పై నమ్మకం లేదు అందుకే ఇలా జరిగింది అంటూ మాట్లాడారు
వెంటనే నేను శివాలయంలోకి వెళ్లాను ఆరోజు బాగా తాగి ఉన్నానని తెలిపారు. ఆ అమ్మాయి కనుక నాకు ఓకే చెబితే దేవుడు ఉన్నాడని నమ్ముతాను లేదంటే నువ్వు ఒక రాయివని నేను భావిస్తాను అంటూ రాజశేఖర్ దేవుడికే ఛాలెంజ్ చేశారని వెల్లడించారు. ఇలా దేవుడి గుడిలో నేను ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఒకప్పుడు నన్ను రా, పోరా అని పిలిచేది అలాంటిది తనపై ఇష్టంతో రండి వెళ్ళండి అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడేదంటూ ఈయన తెలిపారు.
ఆ క్షణం నేను దేవుడిని నమ్మాను అంటూ (Rajasekhar) రాజశేఖర్ వెల్లడించారు. మరి రాజశేఖర్ ప్రేమించిన అమ్మాయి ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరి ఎవరో కాదు నటి జీవిత అని రాజశేఖర్ తన లవ్ స్టోరీ గురించి దేవుడిపై నమ్మకం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.