Ram: క్రేజీ హీరోయిన్ తో హీరో రామ్ పోతినేని పెళ్లి ఫిక్స్.. ఎప్పుడంటే..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో హీరో రామ్ కచ్చితంగా ఉంటాడు. ఇతనికి ఉన్నటువంటి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. మొదటి సినిమా ‘దేవదాసు’ చిత్రం నుండే ఆయనకీ లేడీస్ ఫాలోయింగ్ ఉంది. ఇక తర్వాత కెరీర్ లో హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా తన ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వచ్చాడు. అయితే రామ్ తోటి హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.

కానీ రామ్ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆయన వయస్సు ఇప్పుడు 35 ఏళ్ళు. ఇంకో రెండేళ్లు దాటితే చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ కి ఒక అతిధి గా వచ్చిన రామ్ ని, కంటెస్టెంట్ శివాజీ కూడా అడుగుతాడు. పెళ్లి చేసుకోండి సార్, చాలా ఆలస్యం అయిపోయింది అని అంటాడు. అప్పుడు రామ్ చిరునవ్వు నవ్వి వదిలేస్తాడు కానీ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు.

అయితే ఇప్పుడు రామ్ (Ram) ఒక క్రేజీ యంగ్ హాట్ బ్యూటీ తో చాలా కాలం నుండి డీప్ లవ్ లో ఉన్నాడని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసుకుంటున్నారు అంటూ ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళీ బ్యూటీ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ ఈమె అంటే పిచ్చెక్కిపోతుంటారు.

ఈ క్యూట్ జంట కలిసి ఇప్పటి వరకు ‘హలో గురు ప్రేమకోసమే’ అనే చిత్రం లో మాత్రమే కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. డిసెంబర్ నెలలో ఒక మంచి ముహూర్తం చూసి వీళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిపి, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారని టాక్. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus