టాలీవుడ్ లో మూడు పదుల వయసు దాటిన యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంది ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. ప్రభాస్ 40 ప్లస్ కాబట్టి అతన్ని తీసేస్తే … ఈ లిస్ట్ లో శర్వానంద్, విజయ్ దేవరకొండ, రామ్ వంటి హీరోలు ఉన్నారు.గత రెండేళ్లలో నితిన్, రానా, నిఖిల్ వంటి హీరోలు పెళ్లి చేసుకున్నారు. శర్వానంద్ కూడా పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఈ మధ్యన రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అది కూడా ప్రేమ వివాహం. తన బాల్య స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన ఓ అమ్మాయిని రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్ళికి ఒకే చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల పై రామ్ క్లారిటీ ఇచ్చాడు. రామ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “భగవంతుడా… ! ఇక చాలు ఆపండి..నేను హైస్కూల్ ఫ్రెండ్ ని రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నానంటూ మొదలైన రూమర్స్ మా ఇంటి వరకు చేరాయి.
దీంతో నా ఫ్యామిలీ మెంబెర్స్ కి , ఫ్రెండ్స్ కి అలాంటిదేం లేదని ప్రత్యేకంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే అసలు నేను స్కూల్ కి కూడా సరిగా వెళ్లేవాడినే కాదు’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు రామ్. అంటే పెళ్లి వార్తల్లో ఎటువంటి నిజం లేదన్న మాట. ఇక రామ్ హీరోగా నటించిన ‘వారియర్’ చిత్రం జూలై 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా…దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్.