‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!

తమిళ హీరోలు చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటారు. ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత ఎక్కువ మార్కెట్ కలిగిన ఇండస్ట్రీగా కోలీవుడ్ ఉండేది. ఇప్పుడంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్ పుణ్యమా అని తెలుగు, కన్నడ సినిమాల మార్కెట్ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు తమిళ్ కంటే తెలుగు సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి.. తమిళ సినిమాలు గురించే మాట్లాడుకుందాం. అక్కడ నెంబర్ వన్ హీరోగా చలామణి అవుతుంది రజినీకాంత్. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు అంతంత మాత్రమే ఆడినా.. ఓ మాదిరి టాక్ వస్తే చాలు పోటీగా వచ్చిన సినిమాలు అన్నీ దుకాణం సర్దేస్తూ ఉంటాయి. ఇక రజనీ తర్వాత విజయ్ ఇప్పుడు టాప్ ఆర్డర్ లో ఉన్నాడు. ‘తుపాకీ’ చిత్రం ఇతనికి మళ్ళీ లైఫ్ ఇచ్చింది. అప్పటి నుండీ ఇతను చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. అలాగే అజిత్ కూడా టాప్ ఆర్డర్ లోనే కొనసాగుతున్నాడు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్ ‘విక్రమ్’ తో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు. ఈ విషయాలను పక్కన పెట్టేసి.. తమిళంలో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాలు ఏంటో..ఏ హీరో సినిమా ఏ ప్లేస్ లో ఉందో ఓ లుక్కేద్దాం రండి :

1) 2.ఓ :

Robo 2, Robo 2.0 Movie, Rajinikanth, Actress Amy Jackson, Director Shanker, Akshay Kumar,

శంకర్ – రజినీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రోబో’ కి సీక్వెల్ గా రూపొందింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.850 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బాలీవుడ్లో కూడా ఈ మూవీ రూ.100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అందుకు కారణం ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం వల్లనే అని చెప్పాలి.

2) విక్రమ్ :

కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. దూసుకుపోతుంది. అందుకు కమల్ తన ఆనందం వ్యక్తం చేస్తూ సూర్య, లోకేష్ లతో పాటు టీం అందరికీ లక్షలు విలువ చేసే బహుమతులు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

3) కబాలి :

kabali

రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.295 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఈ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

4) రోబో :

robo

శంకర్- రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.289 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) బిగిల్(తెలుగులో ‘విజిల్’) :

విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.275 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) సర్కార్ :

విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.253 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) మెర్సల్(తెలుగులో ‘అదిరింది’):

విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.245 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8) బీస్ట్ :

విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.237 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

9) దర్బార్ :

shocking-satires-on-rajinikanths-darbar-movie1

రజినీకాంత్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.235 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) అన్నాతె(తెలుగులో ‘పెద్దన్న’) :

రజినీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.228 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పాండమిక్ తర్వాత అక్కడ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మొదటి మూవీ ఇదే కావడం విశేషంగా చెప్పుకోవాలి.

Share.