తెలుగు తమిళ బైలింగు మల్టీస్టారర్ లో రామ్!

  • September 12, 2018 / 06:21 AM IST

మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలకి మ‌రింత‌ ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో సీనియ‌ర్ హీరోలు, కుర్ర హీరోలు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేసేందుకు ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చాలానే సెట్స్ పై ఉన్నాయి. త్వ‌ర‌లో మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ఓ త‌మిళ స్టార్ హీరోతో క‌లిసి మ‌ల్టీ స్టారర్ సినిమాని చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోరే ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

రామ్ ప్ర‌స్తుతం నేను లోక‌ల్ ఫేం త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ లో కామెడీ హైలెట్ అవ్వనుందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus