రామ్ సినిమాకి అంత బడ్జెట్ పెడుతున్నారా? అంటూ మొన్నీమధ్య వరకు మనం మాట్లాడుకున్నాం. అదేనండీ బోయపాటి శ్రీను సినిమా గురించి. ‘వారియర్’ సినిమాకు మందు జరిగిన చర్చ ఇదీ. ఆ సినిమా విజయం కోసమో, విజయం దక్కించుకుంటుంది అనో కానీ.. బోయపాటి సినిమా గురించి బలంగా ఈ మాటలు వినిపించారు. అయితే ‘వారియర్’ ఫలితం తేడా కొట్టేసరికి ఆ తర్వాత ఎలాంటి ముచ్చట్లూ లేవు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకటి గుడ్ అయితే, ఇంకొకటి ఇబ్బంది అనిపించేది.
ముందు గుడ్ న్యూస్ చూస్తే… బోయపాటి సినిమా కోసం రామ్ మేకోవర్‌కి సిద్ధమవుతున్నాడట. ఏకంగా ఈ సినిమా కోసం పది కిలోల బరువు పెరగాలని చూస్తున్నాడట. బోయపాటి స్థాయి యాక్షన్ సీన్స్ కోసం హీరో ఆ మాత్రం హల్క్‌లా ఉండాలి కదా. అందుకే రామ్‌ను ఆ దిశగా నడిపిస్తున్నారట బోయపాటి శ్రీను. ఈ మేకోవర్ అయ్యాక సినిమా షూటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం దీని కోసం రామ్ జిమ్‌లో చెమటోస్తున్నాడని చెబుతున్నారు.
ఈ విషయం ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అయితే… ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతోంది. అదే ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాత మనసు మార్చుకోవడం. ‘వారియర్’ విజయం తర్వాత బోయపాటి సినిమా మొదలవుతుంది ఏమో అని.. తొలుత ఈ సినిమాకు రూ. 100 కోట్లు పెడదాం అనుకున్నారట. పాన్ ఇండియా స్థాయిలోనో లేకపోతే ఎక్కువ భాషల్లోనే ఈ సినిమా రిలీజ్ చేసి వసూళ్లు సాధించొచ్చు అనుకున్నారు. అయితే ఇప్పుడు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి మనసు మారిందట.
దీంతో సినిమా బడ్జెట్ తగ్గించుకుందాం అని చూస్తున్నారట. అయితే బోయపాటి మాత్రం అంత మొత్తంలో ఖర్చుపెడితే మంచి సినిమా వస్తుంది అనే నమ్మకంలో ఉన్నారట. దీంతో ఈ సినిమాకు మరో నిర్మాతను యాడ్ చేయాలని చూస్తున్నారట. తెలుగులో నిర్మాతల కలయిక కొత్తేమీ కాదు. కాబట్టి రామ్ సినిమాకు ఇద్దరు నిర్మాతలు వస్తారనే మాట వినిపిస్తోంది. అయితే అదెవరు అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పాత్ర కోసమే బరువు పెరుగుతున్నాడట.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!