సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరిగినట్లు.. సక్సెస్ చుట్టూ ఫిలిమ్ ఇండస్ట్రీ తిరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తాజా నిదర్శనం నివేదా పేతురాజ్. అందం, అభినయ సామర్ధ్యం పుష్కలంగా ఉన్న ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లవుతోంది. కానీ.. మొన్నటివరకూ అమ్మడికి చెప్పుకోదగ్గ ఆఫర్ ఒక్కటి కూడా రాలేదు. కానీ.. “చిత్రలహరి” హిట్ అనంతరం అమ్మడి జాతకం మారిపోయింది. ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసింది. ప్రస్తుతం అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి.
“చిత్రలహరి, బ్రోచేవారెవరురా” చిత్రాల్లో సెకండ్ హీరోయినే అయినప్పటికీ.. సదరు పాత్రలను చాలా ఈజ్ తో క్యారీ చేసిన నివేదా పేతురాజ్ ఇప్పుడు రామ్ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. “ఇస్మార్ట్ శంకర్” అనంతరం రామ్ నటించబోయే తదుపరి చిత్రంలో కథానాయికగా నివేదాను ఫైనల్ చేశారు.
రామ్ “ఇస్మార్ట్ శంకర్” ఈ నెల 18న విడుదలవుతుండగా.. పూరీ జగన్నాధ్ తోపాటు రామ్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఛార్మీ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఓ హాలీవుడ్ చిత్రానికి ఫ్రీమేక్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. జూలై 18న అసలు విషయం తెలుస్తుంది.