టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్ సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇంకా హాట్‌హాట్‌గానే వుంది. దీనికి సంబంధించి నిత్యం ఎవరో ఒక సెలబ్రెటీ ఏదో ట్వీట్ చేయడమో, ప్రెస్‌మీట్‌లో ఏదో ఒకటి చెప్పడమో జరుగుతోంది. మరికొంతమంది నిరాధారమైన ఆరోపణలతో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి నిన్న సమంత గట్టి వార్నింగ్ ఇచ్చింది. ‘‘తనకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవని, అబార్షన్స్ కూడా చేయించుకోలేదని, దయచేసి తనను ఒంటరిగా వదిలేయాలని పోస్ట్ పెట్టింది. అయితే సమంత – నాగచైతన్య విడాకుల అనౌన్స్‌మెంట్ జరిగిన రోజున హీరో సిద్ధార్ధ్ చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘‘ తాను చిన్నప్పుడు స్కూట్ టీచర్ నుంచి ఓ పాఠం నేర్చుకున్నాను ..
మోసం చేసిన వాళ్లు ఎప్పటికీ బాగుపడరు అన్నది ఆ ట్వీట్ సారాంశం. అయితే సమంతను ఉద్దేశించే సిద్దార్థ్ ఈ ట్వీట్ చేశాడని సినీ జనాలతో పాటు మీడియా కథనాలను వండి వార్చింది. ఈ నేపథ్యంలో నాటి ట్వీట్‌పై సిద్దార్థ్ స్పందించారు. మహాసముద్రం ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తన ఇంటి బయట కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ట్వీట్ వేస్తే.. ఎవరోవచ్చి నన్ను కుక్క అంటావా? అని అంటే తానేమీ చేయలేనని సిద్దార్థ్ అన్నారు.
ఆ రోజే ఎందుకు వేశారు? అని మీడియా ప్రతినిధి అడగ్గా.. ఏ రోజు అని సిద్దార్థ్ ఎదురు ప్రశ్నించాడు. ఇదే సమయంలో సమంతకు విడాకులు అయిన రోజు అని చెప్పబోతోంటే.. వేరే వాళ్ల గురించి నా దగ్గర ప్రస్థావించకండి.. నేను ఎవ్వరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని సిద్ధార్థ్ తేల్చిచెప్పారు. అయితే యాధృచ్చికంగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై సమంత గట్టి సమాధానం చెప్పినరోజే సిద్ధార్థ్ కూడా ట్వీట్‌పై క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు