“ఎల్.బి.డబ్ల్యూ, చందమామ కథలు’ వంటి చక్కటి చిత్రాలను అందించిన ప్రవీణ్ సత్తారు తాజాగా తెరకెక్కించిన “గుంటూర్ టాకీస్’ నిరాశను మిగిల్చింది. దీని ద్వారా ఆయన ఎక్కువ విమర్శలను ఎదుర్కొన్నారు. దాంతో ఓ మంచి ప్రాజెక్ట్‌ను తిరిగి పట్టాలపైకి తెచ్చే ఆలోచనలో ఉన్నారట.
అందులో భాగంగా తెలుగు, తమిళ కథానాయకుడు సిద్దార్థ్‌కు ఓ కథను వినిపించారట. అది ఆయనకు ఎంతగానో నచ్చడంతో సిద్దార్థ్‌ను కథానాయకుడిగా పెట్టి, తెలుగు, తమిళ భాషలలో సినిమా చేస్తే బిజినెస్ పరంగా కూడా బావుంటుందని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రావచ్చునని, కొద్దిరోజులు ఆగితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవచ్చునని అంటున్నారు.