Srikanth: హీరో శ్రీకాంత్ కోపానికి కారణం అదేనా..! అసలు ఏమి జరిగిందంటే..!

  • November 1, 2023 / 04:38 PM IST

ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి క్యారక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కెరీర్ ని ప్రారంభించి వరుసగా సినిమాలు చేసిన శ్రీకాంత్, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని అప్పటి స్టార్ హీరోస్ లో ఒకడిగా కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని అప్పట్లో శ్రీకాంత్ సినిమాలు తెరకెక్కేవి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లోనే ఆయనకీ ఎక్కువగా క్రేజ్ ఉండేది.

అలా అతి తక్కువ సమయం లోనే వంద కి పైగా చిత్రాలలో హీరో గా నటించి సరికొత్త రికార్డుని నెలకొల్పిన శ్రీకాంత్ ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోస్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఆయన కొడుకు రోషన్ కూడా ఇండస్ట్రీ లో హీరో గా అడుగుపెట్టి ‘పెళ్లి సందడి’ అనే సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే (Srikanth) శ్రీకాంత్ డైరెక్టర్స్ హీరో, వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యడానికి , దాని కోసం ఎంత కష్టపడడానికి అయినా సిద్దపడే తత్త్వం ఉన్న అతి తక్కువ మంది హీరోలలో ఆయన కూడా ఒకడు. అయితే ఎంత డైరెక్టర్స్ హీరో అయినా ఆయన కూడా ఒక మనిషే, కోపం సహజంగానే ఎదో ఒక సందర్భం లో వచ్చేస్తూ ఉంటుంది. అలా ఒక ప్రముఖ డైరెక్టర్ పై శ్రీకాంత్ చాలా తీవ్రంగా ఫైర్ అయ్యాడట.

ఒక షాట్ కోసం రోజు మొత్తం నాన్ స్టాప్ రీ టేకులు అడుగుతూనే ఉండడం తో శ్రీకాంత్ కి కోపం వచ్చి అసలు ఏమి తీస్తున్నావు నువ్వు అని ఆ డైరెక్టర్ ని కొట్టేందుకు ముందుకు వెళ్ళాడట. ఆ రోజు ఆయనకీ వచ్చిన కోపానికి డైరెక్టర్ ని చంపేయాలని అనుకున్నాడట. కానీ తనలోని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని నేరుగా కారవ్యాన్ లోకి వెళ్ళిపోయాడట. ఇంతకీ శ్రీకాంత్ అలా కోప్పడిన డైరెక్టర్ మరెవరో కాదు, కృష్ణ వంశీ అని టాక్.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus