యువ హీరో తనీష్ తండ్రి వర్ధన్ మృతి

  • May 18, 2016 / 05:49 AM IST

దేవుళ్ళు, మన్మధుడు చిత్రాల్లో బాల నటుడిగా కనిపించి, నచ్చావులే సినిమా ద్వారా హీరో గా పరిచయమైనా తనీష్ తన తండ్రిని కోల్పోయాడు. దీంతో వారి ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. తనీష్ కుటుంబం మణికొండలోని ఓయూ కాలనీ, వెస్ట్రన్ అపార్ట్ మెంట్లో ఆరవ ఫ్లోర్ లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి తనీష్ తండ్రి వర్ధన్ సిగరెట్ కాల్చుకోవడానికి బాల్కనీ లోకి రాగ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయారని, దీంతో తీవ్రంగా రక్తస్రావం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించిన కాపాడుకోలేక పోయామని విలపించారు.

వర్ధన్ ప్రమాదం గురించి అయన కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ లకు సమాచారం అందించక పోవడంతో.. అయన మృతి ఫై పోలీస్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్ జారి పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారా ? అనే కోణంలో రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus