Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
- November 16, 2026 / 04:06 PM ISTByPhani Kumar
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యాడు యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja). అతను పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరిగింది. అది నిజమే అని ఇటీవల కన్ఫర్మ్ చేసింది తేజ సజ్జా యూనిట్. ఈరోజు నిశ్చితార్థం వేడుక కూడా ఘనంగా జరగడం విశేషంగా చెప్పుకోవాలి. తేజ సజ్జా (Teja Sajja)నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తేజ సజ్జా ఎంగేజ్మెంట్ ఒక ప్రైవేట్ వేడుకలా జరిగింది.
Teja Sajja
ఈ వేడుకకు చిరంజీవి, రవితేజ, నాని, రానా వంటి స్టార్స్ అంతా హాజరయ్యారు. పలు రాజకీయ నాయకులు సైతం ఈ వేడుకలో సందడి చేశారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు వంటి వారు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. తేజ సజ్జా (Teja Sajja) పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయి కాదు అని తెలుస్తోంది.

అమెరికాలో (USA) పుట్టి పెరిగిన అమ్మాయి అని, ప్రస్తుతం తన తండ్రితో కలిసి టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారని ఇటీవల తేజ సజ్జా ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. తనకి కాబోయే భార్యకు సినిమా గ్లామర్, లైమ్లైట్ పట్ల ఎటువంటి ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. ఆమె నిర్ణయం తేజ సజ్జాకి బాగా నచ్చిందట. పబ్లిక్ అటెన్షన్‌కు కూడా ఆమె దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె కోరిందట. అందుకే తేజ సజ్జకి కాబోయే భార్య పేరు వంటివి బయటకి చెప్పడం లేదు.
నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్ చేస్తారా? ప్లాన్ ప్రకారం వస్తే..











