ప్రముఖ తమిళ హీరో దళపతి విజయ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అందువల్ల టాలీవుడ్ ప్రేక్షకులు కూడా విజయ్ కి అభిమానులుగా మారిపోయారు. ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం వారీసు సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. విజయ్ తెలుగులో నటిస్తున్న మొట్ట మొదటి సినిమా ఇది.
ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాని తెలుగు తమిళ్ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. అయితే మరొక తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన ‘ తుణివు ‘ సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొననుంది.
దీంతో ఇద్దరి హీరోల అభిమానులు మధ్య వివాదాలు తలెత్తయి. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా విజయ్ చెన్నైలోని పనైయుర్ లో ఉన్న తన కార్యాలయంలో అభిమానులతో భేటీ అయ్యాడు. ఇటీవల కూడా ముక్తల్ ఇరుక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశమయ్యారు. ఇక తాజాగా అరియాలూర్, పెరంబలూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశం అయ్యాడు. ఈ సమావేశంలో అభిమానుల మధ్య జరుగుతున్న వివాదం గురించి విజయ్ చర్చించాడు.
అంతే కాకుండా వారీసు సినిమా విడుదల తేదీ, ఇతర విషయాల గురించి సుధీర్ఘంగా అభిమానులతో చర్చించాడు. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో తమ అభిమాన హీరోని కలుసుకున్న అభిమానులు కేకలు వేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక వారిసు సినిమా పై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ మొదటిసారిగా తెలుగులో నటిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు.