ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే తేదీన లేదంటే దగ్గర దగ్గర తేదీల్లో విడుదలైతే.. వినడానికే వావ్ అనిపిస్తుంది. అందులోనూ ఆ రెండు సినిమాలు పాన్ ఇండియావి అయితే ఇంకా అదిరిపోతుంది. అయితే ఇదంతా సగటు ప్రేక్షకుడి వైపు నుండి ఆలోచిస్తే. అయితే అభిమానం పేరుతో, ఉన్మాదం చూపించే కొంతమంది నెటిజన్లు ఉండటంతో ఇది చాలా ఇబ్బంది తెస్తోంది అని చెప్పొచ్చు. తమ హీరో మీద ప్రేమతో, మరో హీరో సినిమాను, హీరోను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.
ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’, యశ్ ‘కేజీయఫ్ 2’ మధ్య ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పొచ్చు. కన్నడ పరిశ్రమ నుండి వస్తున్న ‘కేజీయఫ్ 2’, తమిళ పరిశ్రమ నుండి వస్తున్న ‘బీస్ట్’ మధ్య వచ్చే నెలలో పోటీ ఉందని చెప్పొచ్చు. నిజానికి రెండు సినిమాలు ఏప్రిల్ 14నే విడుదల కావాలి. అయితే ఒకే రోజు రెండు సినిమాలు ఎందుకు అనుకున్నాడో ఏమో విజయ్ తన సినిమాను ముందు రోజుకు మార్పించుకున్నాడు. దీంతో ఏప్రిల్ 13న ‘బీస్ట్’ వస్తుంది.
ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య పోటీ గురించి యశ్ ఇటీవల మాట్లాడారు. సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో భాగంగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి. ‘కేజీయఫ్ 2’ను విజయ్ ‘బీస్ట్’ సినిమాతో పోల్చవద్దని యశ్ విజ్ఞప్తి చేశాడు. సినిమా రంగానికి విజయ్ ఎంతో చేశారు అని మెచ్చకున్నారు. అయినా ఒక చిత్రాన్ని మరొక చిత్రంతో పోల్చడానికి ఇవేవీ ఎన్నికలు కావు కదా అని యశ్ అన్నాడు. ఇది సినిమా రంగం, మనం రెండు సినిమాలనూ చూద్దాం.
భారతీయ చిత్ర రంగంలో సంబరాలు చేసుకుందాం అని యశ్ పిలుపిచ్చాడు. దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కేజీయఫ్ 2’, ‘బీస్ట్’ ఉన్నాయి. ‘కేజీయఫ్’ మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో పార్ట్ 2 కోసం అన్ని భాషల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తొలి పార్ట్ ట్రైలర్‌కి మించి ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రెండో పార్ట్‌తో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మరోసారి తన సత్తా చాటుతాడని ఆశిస్తున్నారు.