బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సినిమా పనుల్లో వేగం పుంజుకుంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లనున్న ఈ చిత్రానికి దాదాపు టెక్నీషియన్లు, ఆర్టిస్టుల ఎంపికను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ సరసన జోడీగా నటించే భామ దొరికినట్లు సమాచారం. కిరాక్ పార్టీ అనే చిత్రంతో యువకుల హృదయాలను కొల్లగొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందనాపై సుజీత్ ఫోకస్ పడినట్లు తెలిసింది.
ఆమెను డైరక్టర్ సంప్రదించడం, కథ చెప్పడం, రష్మిక నటించడానికి సంతోషంగా ఒప్పుకోవడం జరిగిపోయాయని టాక్. త్వరలో ఆమెకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించి అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ లో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు డార్లింగ్ ఫిల్మ్ కి సంగీతాన్ని అందించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.