Jr NTR, Prashanth Neel: తారక్ కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్..?

  • June 21, 2021 / 10:27 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ జులైలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను పూర్తి చేసి ఆగష్టు నెల నుంచి కొరటాల శివ సినిమా పనులతో బిజీ కానున్నారు. కొరటాల శివ సినిమా పూర్తైన వెంటనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు.

ఈ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ కు జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుండగా ఈ బ్యూటీకి తారక్ కు జోడీగా నటించే ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన రాకపోయినా మేకర్స్ నిధి అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ నిధి జోడీ బాగుంటుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను భిన్నమైన పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోనున్న ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలను కూడా పాన్ ఇండియా కథలతో తెరకెక్కే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ లో నటిస్తుండగా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus