Hero Ram, Boyapati Srinu: బాలీవుడ్ బ్యూటీకి బోయపాటి ఛాన్స్ ఇచ్చారా?

  • February 21, 2022 / 05:32 PM IST

ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తో హీరో రామ్ మార్కెట్ పెరిగిందనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ నటించిన రెడ్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిలీజైంది. ప్రస్తుతం రామ్ నటిస్తున్న ది వారియర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సినిమాసినిమాకు మార్కెట్ పెరిగేలా రామ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

Click Here To Watch

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా ఎంపికైనట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బోయపాటి శ్రీను సినిమాలకు హిందీలో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను సినిమాలు హిందీలో డబ్ అయ్యి రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.

రామ్ సినిమాతో బోయపాటి శ్రీను కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. భారీ బడ్జెట్ తో శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా రామ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్నారు. తన సినిమాలలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండే విధంగా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అఖండ సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ పెరిగిందని తెలుస్తోంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus